https://oktelugu.com/

Silver Ring: ఈ ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీ దేవి తిష్టవేస్తోంది..

జ్యోతిషశాస్త్రంలో, వెండిని చంద్రునితో అనుబంధంగా పరిగణిస్తారట. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలను సూచిస్తుంది. ఒక వ్యక్తి జాతకంలో చంద్రుడు బలహీన స్థితిలో ఉండి, సానుకూల శక్తిని ఇవ్వకపోతే, జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుంది అంటారు జ్యోతిష్యులు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 25, 2024 11:30 am
    Silver Ring

    Silver Ring

    Follow us on

    Silver Ring: చంద్రుడు ఇతర గ్రహాల సానుకూల శక్తిని ఆకర్షించడానికి జ్యోతిషశాస్త్రంలో వెండి ఉంగరాలు సమర్థవంతమైన పని చేస్తాయి అంటారు నిపుణులు.అయితే బొటన వేలికి వెండి ఉంగరాన్ని ధరిస్తే, గ్రహాల సానుకూల శక్తి లభిస్తుందనే నమ్మకం ఉంది. కానీ బొటనవేలుపై వెండి ఉంగరాన్ని ధరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సిందే. కాలి బొటనవేలికి వెండి ఉంగరాన్ని ధరించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో.. దానిని ఎలా ధరించవచ్చో ఓ సారి ఇప్పుడు తెలుసుకుందాం.

    జ్యోతిషశాస్త్రంలో, వెండిని చంద్రునితో అనుబంధంగా పరిగణిస్తారట. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలను సూచిస్తుంది. ఒక వ్యక్తి జాతకంలో చంద్రుడు బలహీన స్థితిలో ఉండి, సానుకూల శక్తిని ఇవ్వకపోతే, జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుంది అంటారు జ్యోతిష్యులు. ఈ సమయంలో, జ్యోతిష్కులు చంద్రుడిని బలోపేతం చేయడానికి బొటనవేలుపై వెండి ఉంగరాన్ని ధరించమని సూచిస్తుంటారు. వెండిని ప్రేమ, అందం వైభవాల గ్రహం అయిన వీనస్‌తో సంబంధం ఉన్న లోహంగా పరిగణిస్తారు. వెండి ఉంగరం ధరించడం వల్ల చంద్రుడు అనుగ్రహం మాత్రమే కాదు శుక్రుడి సానుకూల ప్రభావం కూడా ఉంటుందట.

    ఇక కాలి బొటనవేలుపై వెండి ఉంగరాన్ని ధరించడం వల్ల మనిషికి మానసిక ప్రశాంతత, స్థిరత్వం కలుగుతాయట. ఇది మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి, ఒత్తిడిచ ఆందోళనను తగ్గించడానికి సహాయం చేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం వెండికి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి అంటారు. దీంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుందని.. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని తద్వార అనేక వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది అంటారు. వెండి ఉంగరాన్ని ధరించడం వల్ల ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. దీంతో జీవితంలో శ్రేయస్సు వస్తుంది. కాలి బొటనవేలుపై వెండి ఉంగరాన్ని ధరించడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయిఅంటున్నారు జ్యోతిష్యులు. అదేవిధంగా అదృష్టం పెరుగుతుందట . జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి.