AP Elections 2024: ఆ విషయంలో చంద్రబాబు కంటే జగన్ వైపే మొగ్గు

సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోకేష్, రఘురామకృష్ణం రాజు.. ఇలా అందరి నేతల మెజారిటీపై పెద్ద ఎత్తున బెట్టింగ్ సాగుతోంది.

Written By: Dharma, Updated On : May 25, 2024 11:42 am

AP Elections 2024

Follow us on

AP Elections 2024: ఏపీలో పోలింగ్ ముగిసి 11 రోజులు దాటుతోంది. కౌంటింగ్ కు మరో పది రోజుల గడువు మాత్రమే ఉంది. అన్ని పార్టీల్లో ధీమా కనిపిస్తోంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా టైట్ ఫైట్ మాత్రం ఉంది. అందుకే పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతున్నాయి. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా.. ఆఫ్ లైన్, ఆన్లైన్లో సైతం కోట్లాది రూపాయల బెట్టింగులు నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీ గెలుస్తుందా? కూటమి గెలుస్తుందా? ఫలానా నేత గెలుస్తాడా? ఓడిపోతాడా? గెలిస్తే ఎంత మెజారిటీ? ఓడిపోతే ఎన్ని ఓట్లతో?.. ఇలా రకరకాల అంశాలపై బెట్టింగ్ సాగుతోంది.

అయితే పెద్ద నేతల మెజారిటీపై పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతున్నాయి. సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోకేష్, రఘురామకృష్ణం రాజు.. ఇలా అందరి నేతల మెజారిటీపై పెద్ద ఎత్తున బెట్టింగ్ సాగుతోంది. అయితే ఈ విషయంలో సీఎం జగన్ కు అత్యంత మెజారిటీ వస్తుందని ఎక్కువమంది బెట్టింగ్ కాస్తున్నారు. పులివెందుల నుంచి జగన్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు 60 నుంచి 67 వేల వరకు మెజారిటీ వస్తుందని బెట్టింగ్లు సాగుతున్నాయి.

చంద్రబాబుకు 34 వేల నుంచి 37 వేల వరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉందని, పవన్ కళ్యాణ్ కు 40 నుంచి 47 వేల వరకు, రఘురామకృష్ణం రాజుకు 13 నుంచి 17000 వరకు, లోకేష్ కు 35 వేల నుంచి 42 వేల వరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ఎక్కువమంది బెట్టింగులు కడుతున్నారు. అటు కీలక నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వచ్చే మెజారిటీలపై.. పెద్ద ఎత్తున బెట్టింగులు కొనసాగుతుండడం విశేషం.

వైసీపీలోని కీలక నేతలుగా ఉన్న వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, జోగు రమేష్, అనిల్ కుమార్ యాదవ్, గుడివాడ అమర్నాథ్, మార్గాని భరత్ వంటి వారి విషయంలో ఫలితం తేడా కొడుతోందని.. వారంతాఓటమి జాబితాలో ఉన్నారని ఎక్కువ మంది బెట్టింగులు కాయడం విశేషం. మొత్తానికైతే ఈ విషయంలో సీఎం జగన్ మెజారిటీ పైనే ఎక్కువ బెట్టింగులు కాస్తున్నట్లు తెలుస్తోంది. అటు రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ కే ఎక్కువ మెజారిటీ దక్కే ఛాన్స్ కూడా కనిపిస్తోంది.