Raw Coconut Benefits: కొబ్బరిలో ఎన్నో పోషక విలువలుంటాయి. దీంతో మన రోజువారీ ఆహారంలో దీన్ని వాడుకోవడం మంచిది. మన ఆరోగ్యానికి రక్షణగా నిలిచే కొబ్బరిలో ప్రొటీన్లు, మినరల్స్, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కొబ్బరిని వాడుకుని మన తెలివితేటల్ని పెంచుకోవచ్చు. కేరళలో ఎక్కువగా కొబ్బరిని వాడతారు. కూరల్లో కూడా వారు కొబ్బరి నూనె తీసుకుంటారు. ఇలా వారి జీవితంలో కొబ్బరి ఒక భాగంగా మారిపోయింది. అందుకే వారికి తెలివితేటలు బాగా ఉంటాయి. దీంతో అక్కడ అక్షరాస్యతా శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది.
ఏ ఆహారాలు చేసుకోవచ్చు
కొబ్బరితో మనం ఎన్నో రకాల ఆహారాలు తయారు చేసుకోవచ్చు. కొబ్బరి లడ్డూలు, కొబ్బరి పచ్చడి, ఇంకా అన్ని కూరల్లో కొబ్బరి పొడి వేసుకోవచ్చు. మాంసాహారాల్లో కూడా కొబ్బరి పొడి వేయడం తెలిసిందే. ఇలా కొబ్బరితో మనం ఎన్నో రకాల వంటకాలు చేసుకుంటాం. దీన్ని తినడం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. దేహం మరింత బలంగా మారడంలో కొబ్బరి కీలక పాత్ర పోషిస్తుంది.
పాదాల పగుళ్లకు..
చలికాలంలో పాదాలకు పగుళ్లు ఏర్పడితే అవి పోవడానికి కొబ్బరి నూనె రాస్తారు. కొన్నిసార్లు పగుళ్ల నుంచి రక్తం కూడా కారుతుంది. అంత భయంకరమైన సమస్య నుంచి కూడా కొబ్బరి నూనె బయట పడేస్తుంది. కొబ్బరిలో ఉండే పోషకాలు అలాంటివి. కొబ్బరి ఉండే ప్రొటీన్లు మన శరీరానికి ఎంతో దోహదపడతాయి. అందుకే కొబ్బరిని మనం తినేందుకు ఇష్టపడాలి.
కొబ్బరిలో ఏముంటాయి?
కొబ్బరిలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ మెరుగుపడేందుకు దోహదపడుతుంది. బరువు నియంత్రణలో ఉంచుతుంది. దీంతో కొబ్బరిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పచ్చి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల గుండెకు లాభం చేకూరుస్తుంది. శరీరంలోని మలినాలను దూరం చేసేందుకు దోహదపడుతుంది.
ఏ విటమిన్లు ఉంటాయి?
విటమిన్ ఎ,బిసి, తయామిన్, రైబో ఫ్లెవిన్, నియాసిన్, కాల్షియం, కార్బోహైడ్రేడ్లు, ఇనుము పుష్కలంగా ఉంటాయి. కొబ్బరిని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే మలబద్ధకం, థైరాయిడ్ సమస్యలకు చెక్ పెడుతుంది. కొబ్బరితో శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. పచ్చి కొబ్బరి తినడం వల్ల ఇంకా ఎక్కువ లాభాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.