Zodiac Signs May: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు ద్వాదశ రాశులు శుభ, అశుభ ఫలితాలు కలిగిస్తాయి. మేనెల పన్నెండు రాశులకు అత్యంత కీలకం కానుంది. ఈ నెలలో సూర్యుడు, శుక్రుడు, అంగారకుడు రాశి చక్రంలో మార్పులు తీసుకొస్తాయి. దీంతో మే 15న వ్రషభ రాశిలో గ్రహాల రాజు సూర్యడి సంచారం జరగనుంది. మన జాతకంలో శుక్రుడు మంచి స్థానంలో ఉండటం వల్ల మనకు శుభాలు కలుగుతాయి.
మే 2 నుంచి మిథున రాశిలో ప్రవేశించే శుక్రుడు మే 30 వరకు ఉంటాడు. దీంతో ఐదు రాశుల వారికి ధనలాభం కలగనుంది. జీవితంలో మంచి శుభాలు ఇవ్వనున్నారు. దీని వల్ల మిథున రాశివారికి మంచి లాభాలు అందనున్నాయి. ఉద్యోగులకు మంచి కాలం. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడొచ్చు. జర్నలిజం, రచనలు, విద్యా రంగంలో ఉన్న వారికి ప్రయోజనాలు కలగనున్నాయి.
సింహరాశి వారికి శుభయోగాలున్నాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడొచ్చు. కొత్తగా ఉద్యోగావకాశాలు పలకరిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
వ్రశ్చిక రాశి వారికి సానుకూల వాతావరణం ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశం లభించొచ్చు. వ్యాపారంలో మంచి లాభాలొస్తాయి. మీ పనికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మకర రాశి వారికి మేలు దక్కుతుంది. గతం కంటే ఇప్పుడు డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఉన్న వారికి లాభాలు వస్తాయి. పెట్టిన పెట్టుబడులకు ప్రయోజనాలు కలుగుతాయి.