https://oktelugu.com/

Life Style : క్లీన్ షేవ్ చేసే మగవారి కంటే గడ్డం ఉన్నవారే బెటర్.. ఈ ఇద్దరి మధ్య తేడాలు ఇవే

క్లీన్ షేవ్ ఒకరికి ఇష్టం. గడ్డం ఒకరికి ఇష్టం. హెయిర్ స్టైల్ ఒకరికి ఇష్టం. నార్మల్ గా ఉండటం మరొకరికి ఇష్టం. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధమైన వారిని ఇష్టపడతారు. అయితే, ఎక్కువగా ఆడవారు ఎలాంటి మగవారిని ఇష్టపడతారో తెలుసా? అంతేకాదు గడ్డం ఉన్నవారు, లేనివారి దృష్టిలో రిలేషన్స్ ఎలా ఉంటాయో తెలుసా? అయితే ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదివేసేయండి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : July 21, 2024 / 12:46 PM IST
    Follow us on

    Life Style  : అందరి టేస్టులు డిఫరెంట్ గా ఉంటాయి. కొందరు ఇష్టపడినవి కొందరికి నచ్చకపోవచ్చు. కొందరికి నచ్చనివి కొందరికి నచ్చవచ్చు. చేతికి ఉన్న ఐదు వేళ్లు సమానంగా లేనప్పుడు మనుషులు అందరూ ఒకేలా ఉంటారు అనుకోవడం తప్పు. ఇదంత విన్నదే కొత్తగా ఏం చేప్పాలి అనుకుంటున్నారని ఆలోచిస్తున్నారా? రుకో జర సబర్ కరో.. అయితే ఈ ఇష్టాఇష్టాల గురించి పక్కన పెడితే అమ్మాయిలకు ఎవరు ఇష్టం. ఎవరిని ఇష్టపడరు. అనే వివరాలు చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంది. అందులో గడ్డం ఉన్న అబ్బాయిలను కొందరిని ఇష్టపడితే, కొందరికి క్లీన్ షేవ్ ఇష్టం ఉంటుంది. ఇక ఇందులో ఎవరు బంధాలకు విలువ ఇస్తారు అనేది కూడా ఓ సారి తెలుసుకుందాం.

    క్లీన్ షేవ్ ఒకరికి ఇష్టం. గడ్డం ఒకరికి ఇష్టం. హెయిర్ స్టైల్ ఒకరికి ఇష్టం. నార్మల్ గా ఉండటం మరొకరికి ఇష్టం. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధమైన వారిని ఇష్టపడతారు. అయితే, ఎక్కువగా ఆడవారు ఎలాంటి మగవారిని ఇష్టపడతారో తెలుసా? అంతేకాదు గడ్డం ఉన్నవారు, లేనివారి దృష్టిలో రిలేషన్స్ ఎలా ఉంటాయో తెలుసా? అయితే ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదివేసేయండి.

    క్లీన్ షేవ్ కంటే గడ్డం ఉన్న మగవారినే ఎక్కువ ఇష్టపడతారట మహిళలు. కొందరి అభిరుచులు వేరుగా ఉంటాయట. అందుకే వీరికి క్లీన్ షేవ్ కంటే గడ్డం ఉంటేనే ఇష్టం అంటున్నారు నిపుణులు. అయితే గడ్డం ఉన్న వారు కొత్త రిలేషన్స్ కోసం వెతకకుండా ఉన్నవాటితో ఆనందంగా ఉంటారట. ఇలానే సంతోషంగా ఉండటానికి ట్రై చేస్తుంటారట. అంటే ఉన్న రిలేషన్స్ ను ఎలా కాపాడుకోవాలి అని అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారట. ఇక వీరు ఇలా ఉంటే క్లీన్ షేవ్ ఉన్నవారి మనస్తత్వం గురించి కూడా చెబుతున్నారు నిపుణులు.

    క్లీన్ షేవ్ ఉన్నవారు కొత్తగా రిలేషన్స్ మొదలుపెట్టేందుకు ప్రయత్నిస్తుంటారట. దీని వల్ల రిలేషన్‌షిప్స్‌లో చాలా సమస్యలు వస్తున్నాయి అంటున్నారు నిపుణులు. అందుకే ఆడవారు ఇష్టపడే ముందు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. కానీ అందరి విషయంలో ఇది అప్లే కాదు అని కూడా గుర్తు పెట్టుకోవాల్సిందే. ప్రతి ఒక్కరి మనస్తత్వం ఒకే విధంగా ఉండదు. కొందరు క్లీన్ షేవ్ తో కూడా నీట్ మైండ్ సెట్, మంచి మనస్తత్వంతో ఉంటారు. కొందరు చింపిరి గడ్డంతో భయంకరమైన మనస్తత్వంతో ఉంటారు.

    ఇదిలా ఉంటే గడ్డం ఉన్నవారు దాన్ని పెంచే విషయంలో చాలా ఓపికగా ఉంటారట కొందరు. ఇదేవిధంగా నిజజీవితంలో కూడా చాలా విషయాల్లో వారు ఓపికగా ఉంటారు అంటున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే రొమాంటిక్ రిలేషన్స్ కు ఓపిక చాలా అవసరం. లేదంటే రిలేషన్ ముందుకు వెళ్లడం కూడా కష్టమే. అయితే మగవారు గడ్డాలు, శృంగార సంబంధాల మధ్య ఇటాలియన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో క్లీన్ షేవ్ చేసే మగవారి కంటే గడ్డం ఉన్నవారే రిలేషన్స్‌కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని తేలిందట.

    పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం, గడ్డం ఉండేవారు కుటుంబం, ఫ్రెండ్స్, చుట్టూ ఉన్నవారితో మంచి రిలేషన్ మెయింటెన్ చేస్తారట. మగవారి వ్యక్తిత్వానికి ప్రతీకగా ఉండే ఈ గడ్డాన్ని చాలా మంది ఆడవారు ఇష్టపడతారని కూడా సర్వేలో తేలిందట. దీని వల్ల రొమాంటిక్ రిలేషన్స్‌లో గొడవలు తక్కువ జరుగుతాయి అంటున్నారు నిపుణులు. మరి కేవలం గడ్డం చూసి మాత్రమే ఒక వ్యక్తి మనస్తత్వాన్ని అంచనా వేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది కొందరి ప్రశ్న. అయినా ఒక వ్యక్తి గురించి తెలిస్తే గానీ వారి మెంటాలిటీ చెప్పడం కష్టమే అంటున్నారు మరికొందరు.