https://oktelugu.com/

Saripodha Sanivaram Movie : సరిపోదా శనివారం లో విలన్ పాత్ర ను అలా ఎలా క్రియేట్ చేశారు..

నాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నాని తన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు..

Written By:
  • Gopi
  • , Updated On : July 21, 2024 / 01:01 PM IST
    Follow us on

    Saripodha Sanivaram Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక కొత్త పోకడకు శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా మన సినిమా స్టాండర్డ్ ని విస్తరించేలా చేసిన రాజమౌళిని మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఆయన వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఈ దశలో ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. బాహుబలి సినిమా వచ్చినప్పటినుంచి ప్రతి సినిమా కూడా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతూ మంచి వసూళ్లను రాబడుతున్నాయి. అందుకే తెలుగులో మీడియం రేంజ్ హీరోలుగా గుర్తింపు ఉన్న వాళ్ళు సైతం బాలీవుడ్ లో వందల కోట్ల కలెక్షన్లను రాబడుతూ అక్కడి స్టార్ హీరోలకు సైతం షాక్ ఇస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నాని కూడా ‘దసరా’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను చేశాడు. ఇక ఈ సినిమాకి బాలీవుడ్ లో మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు మరోసారి ‘వివేక్ ఆత్రేయ’ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ లో ఎస్ జే సూర్య బర్త్ డే సందర్భంగా ఆయన విలనిజాన్ని హైలెట్ చేస్తూ ఈ టీజర్ ను డిజైన్ చేశారు.

    ఇక మొత్తానికైతే ఈ సినిమా ద్వారా ఎస్ జే సూర్య సరికొత్త విలన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఆయన విలనిజాన్ని రెగ్యులర్ ఫార్మాట్ కంటే కూడా చాలా కొత్తగా డిజైన్ చేశారు. నరకాసురుడు అప్పట్లో జనాలను హింసించాడో అలాంటి మెంటాలిటీతో ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ గా ఉన్న ఎస్ జె సూర్య జనాన్ని హింసిస్తూ ఉంటాడు అనేది ఈ ట్రైలర్ లో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక అలాగే ఇంతకుముందు ఎస్ జే సూర్య మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాలో కూడా ఒక సైకో పాత్రలో నటించి మెప్పించాడు.

    అయినప్పటికీ ఆ సినిమా మాత్రం డిజాస్టర్ గా మారడంతో ఆయనకు అనుకున్నంత గుర్తింపు అయితే రాలేదు. ఇక ఈ సినిమాలో కూడా మరొకసారి సైకో పోలీస్ ఆఫీసర్ గా ఆయన నటించబోతున్నాడు. మరి ఈ పాత్ర ఆయనకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది. దీని ద్వారా ఆయన తెలుగులో కూడా చాలా మంచి ఆఫర్లను అందుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ముఖ్యంగా వివేక్ ఆత్రేయ ఇంతకుముందే నానితో ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ నాని మరొకసారి ఆయన మీద నమ్మకం ఉంచి ఆయనకి అవకాశం అయితే ఇచ్చాడు.

    ఈ సినిమాతో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోబోతున్నట్టుగా కూడా ఈ టీజర్ ని చూస్తే మనకు క్లియర్ గా అర్థం అవుతుంది…ఇక గత రోజుల నుంచి నాని హీరో గా వస్తున్న సినిమాలు అన్నీ కూడా చాలా మంచి కథలతో వచ్చి సూపర్ హిట్లు గా నిలుస్తున్నాయి. చూడాలి మరి నాని ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అలాగే వివేక్ ఆత్రేయ కూడా నాని పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాడా లేదా అనేది…