https://oktelugu.com/

Pawan Kalyan  : సతీమణితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సెల్పీ.. పవన్ ఎక్కడున్నా క్రేజ్ అంటూ ఆ వీడియోతో ఫ్యాన్స్ హల్ చల్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటేస్టుగా సింగపూర్ పయనమ్యారు. ఆయన సతీమణి అన్నా లెజినోవా సింగపూర్ యూనివర్సిటలో మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో పోస్టు గ్రాడ్యుయేట్ చేశారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ లో పీజీ చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ నిర్వహించిన సెర్మనీకి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సెర్మీలో అన్నా లెజినోవా పట్టా అందుకున్నారు

Written By:
  • Srinivas
  • , Updated On : July 21, 2024 / 12:31 PM IST
    Follow us on

    Pawan Kalyan  : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ జోష్ ఇచ్చే హీరో పవన్ కల్యాణ్. పవన్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ లో ఎక్కడా లేని ఉత్సాహం. నాటి నుంచి నేటి వరకు క్రేజ్ తగ్గని హీరో ఎవరంటే పవన్ కల్యాణ్ అని చాలా మంది కొనియాడుతూ ఉంటారు. కొన్ని కారణాల వల్ల 3 సంవత్సరాలు సినిమాలు విరామం ఇచ్చానా.. పవన్ కు ఉన్న ఆదరణ తగ్గడం లేదు. దీంతో ఫ్యాన్స్ ఒత్తిడి కారణంగానే మళ్లీ సినిమాల్లోకి వచ్చానంటూ పవన్ చెబుతూ ఉంటారు. అయితే ఓ వైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు రాజకీయాల్లో కొనసాగిన పవన్ కల్యాణ్ ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం అయిన తరువాత పవన్ బిజీ బిజీగా కనిపించారు. పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తానంటూ హామీ ఇస్తూ వస్తున్నారు. జనసేన పార్టీ అధినేతగా ఉన్న పవన్ ఓ వైపు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కార్యకర్తలతో మమేకం అవుతూ వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అధికారంలో ఉన్నామని ఎక్కడా తప్పు చేయొద్దని వారికి సూచిస్తున్నారు. కొందరు ‘పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా’ అని వాహనాల వెనుకపై బోర్డు తగిలించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. ఇలా కొన్నాళ్ల పాటు బిజీ బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఇటీవల సింగపూర్ వెళ్లారు. అయితే ఒక్కసారిగా తన సతీమణి తో కలిసి సెల్ఫీతో దర్శనమిచ్చారు. అయితే పవన్ తన సతీమణితో ఫొటో ఎందుకు దిగాల్సి వచ్చింది? అసలేం జరిగింది?

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటేస్టుగా సింగపూర్ పయనమ్యారు. ఆయన సతీమణి అన్నా లెజినోవా సింగపూర్ యూనివర్సిటలో మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో పోస్టు గ్రాడ్యుయేట్ చేశారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ లో పీజీ చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ నిర్వహించిన సెర్మనీకి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సెర్మీలో అన్నా లెజినోవా పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా సతీమణి అన్నా లెజినోవాకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ ఆమెతో సెల్పీ దిగారు. ఇదిలా ఉండగా పవన్ కల్యాణ్ తన సతీమణి కోసం నడుచుకుంటూ వెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. పవన్ ఎక్కడున్నా స్టైల్ తగ్గడం లేదని ఫ్యాన్స్ హల్ చల్ చేస్తున్నారు.

    అన్నా లెజినోవా రష్యాకు చెందిన అమ్మాయి. 2011 పవన్ కల్యాణ్ ‘తీన్మార్’ సినిమా సందర్భంగా వీరు మొదటిసారిగా కలిశారు. ఈ సందర్భంగా వీరు ప్రేమలో పడ్డారు. ఆ తరువాత వీరిద్దరు 2013లో పెళ్లి చేసుకున్నారు. వీరికి శధంకర్ పనవోవిచ్ అనే కుమారుడు కూడా ఉన్నారు. అన్నా లెజినోవా ప్రాథమిక విద్యతో పాటు అక్కడే ఉన్న సెయింట్ పీటర్స్ బర్గ్ స్టేట్ యూనివర్సిటీలో డిగ్రీ చదివారం ఆ తరువాత బ్యాంకాక్ లోని చులాలాంగ్ కార్న్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ట్స డిగ్రీ సాధించారు. ఇప్పుడు సింగపూర్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు.

    పవన్ కల్యాణ్ ను పెళ్లి చేసుకున్న తరువాత అన్నా లెజినోవా పూర్తిగా భారతీయ సంప్రదాయాలను పాటిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా చీరకట్టులోనే కనిపిస్తున్నారు. పవన్ కు అన్ని వేళలా తోడుంటూ ఆయనకుమద్దతుగా నిలుస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం సందర్బంగా ఆయనకు వీరతిలకం దిద్ది ప్రచారానికి పంపిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అటు పవన్ కుటుంబ సభ్యులతోనూ అన్నా లెజినోవా కలిసి మెలిసి ఉంటారు. పలు సందర్భంగా మెగాస్టార్ ఇంట్లోకి పవన్ కల్యాణ్ తో కలిసి వెళ్లినట్లు ఫొటోలు బయటకు వచ్చాయి.