Relaionship : భార్యభర్తల బంధం చాలా పవిత్రమైనది. అందుకే వివాహ సమయంలో ఎన్నో మంత్రాలు, పూజలు చేస్తుంటారు. వీరి బంధం శాశ్వతంగా ఉండాలని ఈ వేడుకకు వచ్చిన అతిథులు కోరుకుంటారు. ప్రస్తుతం కాలంలో ఇద్దరువ్యక్తులు కలిసి ఉండడానికి పెద్దగా సమయం తీసుకోవడం లేదు. అందులోనూ పెళ్లి వరకు ఆగకుండానే లివింగ్ రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నారు. పెళ్లికి ముందు ఒకరినొకరు అర్థ చేసుకోవాలి.. మనసులు పంచుకోవాలి.. అనే కాన్సెప్టుతో ఈ విధంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కాబోయే భర్త నుంచి భార్య ఏం కోరుకుంటుంది? ఏ విషయాలతో తనను ఆకట్టుకునేలా చేయొచ్చు? అని చాలా మంది మగవాళ్లు తర్జన భర్జన పడుతూ ఉంటారు. అయితే కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్న ప్రకారం ఎక్కువ మంది లేడీస్ మగవారి నుంచి ఈ 5 విషయాలను గ్రహిస్తారట. ఈ విషయాల్లో మీరు ఫర్పెక్ట్ అని తెలితే.. ఆమె మిమ్మల్నీ జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటుందని అంటున్నారు. ఇంతకీ ఆ 5 విషయాలు ఏవి? కాబోయే భార్యను ఆకట్టుకోవాలంటే ఏం చేయాలి?
ప్రేమ:
సాధారణంగా చాలా మంది మగవాళ్లు నేటి కాలంలో ఆడవాళ్లను డబ్బుతో ఆకర్షించాలని ప్రయత్నం చేస్తారు. కానీ మంచి అమ్మాయి కాబోయే భర్త నుంచి ప్రేమ మాత్రమే కోరుకుంటుందని గ్రహించాలి. తనను ప్రేమగా చూసుకోవడం. ఇతరులతో మంచిగా మాట్లాడడం వంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలంటే చాలా వరకు ఇష్టపడుతారు. అంతేకాకుండా ఏ విషయాన్నయినా అర్థం చేసుకునే మనస్తత్వం ఉండే ప్లాట్ అయిపోతారంతే..
షేరింగ్:
భార్యభరత్లు అన్యోన్యంగా ఉండాలని అంటారు. అంటే ఒకరి విషయాలను మరొకరు పంచుకోవడం. దంపతులిద్దరి మనస్తత్వాలు వేర్వేరుగా ఉంటాయి. కానీ ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరొకరు హేళన చేయకుండా వారికి మద్దతుగా ఉండాలి. వారికి మానసికంగా భరోసా ఇవ్వడంతో వారికి ఎక్కడలేని శక్తి వస్తుంది. ఇలా మగవారు ఒక్కసారి చూపిస్తే చాలు.. మీ వెంటే రావడానికి ప్రయత్నిస్తారు.
టైం మేనేజ్మెంట్:
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ బీజీనే. కానీ ఎన్ని పనులు ఉన్నా కుటుంబం కోసం కచ్చితంగా కొంత సమయం కేటాయించాలి. పెళ్లి చేసుకున్న తరువాత తాను కుటంబం కోసం సమయం కేటాయిస్తానని ముందే చెప్పగలగాలి. అందులో భాగంగా ఎన్ని పనులు ఉన్నా వాటిని పక్కనబెట్టి కాబోయే భార్య కోసం సమయం కేటాయించాలి. అప్పుడే మీమ్మల్ని గాఢంగా నమ్ముతుంది.
మద్దతు:
నేటికాలంలో మగవారితో పాటు ఆడవాళ్లు కూడా పనిచేస్తున్నారు. కానీ కొందరు పెళ్లయిన తరువాత ఉద్యోగం మానేయాలనే కండిషన్ పెడుతారు. ఈ విషయంలో ఆడవారికి అస్సలు నచ్చదు. ఎందుకంటే ఉద్యోగం చేయడం వల్ల వారు స్వేచ్ఛగా ఉండగలుగుతారు. తన కాళ్ల మీద తాను నిలబడుతున్నాననే ఫీలింగ్ ఉంటుంది. ఈ విషయంలో మీరు గనుక కాబోయే భార్యకు అవకాశం ఇస్తే ఆమె మిమ్మల్ని విడిచిపెట్టే అవకాశమే లేదు.
ఇంటి బాధ్యతలు:
ఒక కుటుంబంలో అందరూ పనిచేస్తారు. భర్త ఫీల్డు వర్క్ చేస్తే భార్య హోం వర్క్ చేస్తుంది. వాస్తవారిని భార్య ఒక్కరోజు తన విధులకు సెలవు పెడితే కుటుంబం అంతా ఆకలి కేకలు పెడుతుంది. అందువల్ల ఇంట్లో ఉండే ఆడవారికి మద్దతుగా ఉండాలి. వారి మనసు దోచుకోవడానికి వారితో కలిసి పనులు చేయాలి. ఉద్యోగం, వ్యాపారం చేస్తూనే తనకు కూడా సాయం చేసే భర్త రావడం తనకు అదృష్టం అంటూ.. ప్రతీ భార్య తన భర్తను గుండెల్లో పెట్టుకుంటుంది.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Be perfect in these 5 things to win your future wifes heart
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com