Fake Calls : స్మార్ట్ ఫోన్ వచ్చిన తరువాత కొన్ని పనులు ఎంత ఈజీగా అవుతున్నాయో.. అన్నీ కష్టాలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లతో కొందరు మొబైల్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక వ్యక్తికి సంబంధించిన సర్వం డేటా మొబైల్ లో నిక్షిప్తమై ఉంటుంది. అంతేకాకుండా బ్యాంకు అకౌంట్లు, ముఖ్యమైన పత్రాలన్నీ మొబైల్ నెంబర్లతో లింక్ అయి ఉండడం వల్ల మొబైల్ డేటాను చోరీ చేస్తూ వ్యక్తులకు సంబంధించిన నగదును, విలువైన సమాచారాన్ని దోచుకుంటున్నారు. ఇప్పటికే సైబర్ నేరగాళ్లు వలిన పన్నాగాలను ఛేదించినా.. కొత్త కొత్త పద్ధతుల్లో ఫోన్ కు కాల్ చేసి వినియోగదారులకు నష్టాలను తీసుకొస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్ గా దృష్టి పెట్టింది. సైబర్ క్రైం విషయంలో కేర్ ఎక్కువగా తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే?
కమ్యూనికేషన్ రంగంలో మొబైల్ ప్రధాన వాహకంగా ఉంటుంది. ప్రతిరోజూ విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ఫోన్ ను ఏదో విధంగా వాడుతూ ఉంటారు. అయితే ఈ మధ్య కొన్ని విషయాలను చెప్పేందుకు సంస్థలు,కంపెనీలు కొన్ని వెబ్ సైట్ లింకులను పంపి వాటిని ఓపెన్ చేయాలని కోరుతున్నాయి. ఇదే అదనుగా భావించిన కొందరు ప్రముఖ కంపెనీల పేరుతో మొబైల్స్ కు కొన్ని లింకులు పంపిస్తున్నారు. వీటిని ఓపెన్ చేస్తే రివార్డులు, ప్రయోజనాలు ఉంటాయని చెప్పి వాటిపై క్లిక్ చేసేలా కోరుతున్నారు. కొందరు అవగాహన లేక వాటిని ఓపెన్ చేయడం ద్వారా వారి డేటా చోరీకి గురవుతోంది.
అయితే ఈ విషయాలపై వినియోగదారులకు అవగహన పెరగడంతో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో వెళ్తున్నారు. కొందరికి నేరుగా ఫోన్ చేసి తాము పోలీస్, ప్రభుత్వ రంగానికి చెందిన అధికారులమని అంటున్నారు. దీంతో వినియోగదారులు భయపడిపోయి సైబర్ నేరగాళ్లు అడిగిన సమారం అంతా ఇస్తున్నారు. ఆ సమాచారం ఆధారగా వినియోగదారుడికి సంబంధించిన డేటాను దొంగిలించి వాటి ఆధారంగా బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బును కాజేస్తున్నారు. ఇవి ఇటీవల ఎక్కవయ్యాయి. ఆలాంటి ఘటనల గురించి పోలీస్ కంప్లయింట్ రావడంతో వినియోగదారులు అప్రమత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైబర్ నేరగాళ్ల విషయంపై అవగాహన కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే కాలర్ ట్యూన్ గా కొన్ని నెంబర్ల నుంచి తాము ప్రభుత్వ అధికారులమని ఎవరైనా చెబితే నమ్మొద్దని సూచిస్తుంది. ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలంటే నేరుగా కార్యాలయానికి వెళ్లాలని అన్నారు. అలాగే తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది. +8, +85, +65 కోడ్ లతో కాలింగ్ వస్తే వస్తే అస్సలు స్పందించొద్దని తెలిపింది. అంతేకాకుండా ఈ నెంబర్ల నుంచి కాల్ వస్తే సంచార్ సాథి పోర్టల్ లోని Chakshuలో రిపోర్టు చేయాలని సూచించింది. మరోవైపు టెలికాం ఆపరేటర్లు సైతం కొత్త నెంబర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం సూచించిన నెంబర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు తెలుపుతున్నారు.