https://oktelugu.com/

Hangover : డిసెంబర్ 31 రాత్రి తాగింది.. హ్యంగోవర్ కాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి..

డిసెంబర్ 31 రాత్రి ఫుల్లుగా మందు తాగి చిందేయాలని అనుకుంటారు. అయితే రాత్రి స్నేహితులతో డ్రింక్ తీసకునే సమయంలో బాగానే ఉంటుంది. కానీ ఉదయం హ్యాంగోవర్ తో బాధపడుతూ ఉంటారు. తీవ్రమైన తలనొప్పితో ఏ పని చేయడానికి ఉత్సాహం ఉండదు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : December 26, 2024 / 01:01 AM IST

    Hangover Peg

    Follow us on

    Hangover :  పార్టీ అనగానే చాలా మందికి ఉత్సాహం ఉంటుంది. నాటి నుంచి నేటి వరకు ఏదైని కార్యక్రమమైనా అందులోకచ్చితంగా అల్కహాల్ ఉండాలని కోరుకుంటున్నారు. అల్కహాల్ అరేంజ్ మెంట్ తో ఎదుటివారిని ఆకర్షించవచ్చు. అందుకే కొందరు తమ ఫంక్షన్లలో భోజనాలతో పాటు అల్కహాల్ ను కూడా భాగం చేస్తారు. ఇవే కాకుండా ఏదైనా ప్రత్యేక రోజుల్లో కూడా అల్కహాల్ తీసుకొని ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. ముఖ్యంగా డిసెంబర్ 31 రాత్రి ఫుల్లుగా మందు తాగి చిందేయాలని అనుకుంటారు. అయితే రాత్రి స్నేహితులతో డ్రింక్ తీసకునే సమయంలో బాగానే ఉంటుంది. కానీ ఉదయం హ్యాంగోవర్ తో బాధపడుతూ ఉంటారు. తీవ్రమైన తలనొప్పితో ఏ పని చేయడానికి ఉత్సాహం ఉండదు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటంటే?

    డిసెంబర్ 31 నైట్ అనగానే చాలా మందికి ఉత్సాహం ఉంటుంది. ఈరోజు కుర్రాళ్ల నుంచి వృద్ధుల వరకు ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అయితే కొందరు ఎంజాయ్ మూడ్ లో ఉండి అతిగా మద్యం తాగేస్తుంటారు. రెండు పెగ్గుల తరువాత లిమిట్ లేకుండా లాగించేస్తారు. అయితే ముందుగానే ఎన్ని పెగ్గులు తాగాలో డిసైడ్ చేసుకోండి. అవి అయిపోయిన తరువాత ఎట్టి పరిస్తితుల్లో మరో పెగ్గు తీసుకోవడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే ఆ తరువాత కంట్రోల్ తప్పి బాగా తాగేస్తుంటారు.

    కొంత మందికి మంచి కిక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎడా పెడా పెగ్గులు లోపలేస్తుంటారు. అయితే కొన్నిరకాల వైన్స్ ముందుగా సాప్ట్ గా ఉన్నా.. ఆ తరువాత ఓవర్ కిక్ నిస్తుంది. ఇటువంటప్పుడు ముందుగానే మద్యం గురించి తెలుసుకుని దాని మోతాదును తీసుకోవాలి. లేకుంటే ఇది అనారోగ్యానికి కూడా దారి తీస్తుంది. అంతేకాకుండా సాప్ట్ గా ఉన్న మద్యం తీసుకోవడం చాలా ఉత్తమం. మరీ ముఖ్యంగా బ్రాండ్ ఉన్న మద్యం తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బదులు కాకుండా ఉంటుంది.

    చాలా మంది మద్యం తీసుకునే సమయంలో ఖాళీ కడుపుతో ఉండాలని అనుకుంటారు. కానీ ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఖాళీ కడుపుతో మద్యం తీసుకోవడం వల్ల లివర్ పై ప్రభావం ఎక్కువగా చూపుతుంది. ఇందు కోసం ముందుగానే ఏదైనా ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆ తరువాత మద్యం సేవించడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదు. అంతేకాకుండా హ్యాంగోవర్ కాకుండా ఉంటుంది.

    మద్యం తీసుకునే సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఇష్టపడరు.మరికొంత మంది మాత్రం ఆయిల్, ప్రైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు. అయితే మద్యం తీసుకునే సమయంలో వెజ్ బాయిల్డ్ లేదా ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవడం ఉత్తమం. దీని వల్ల హ్యాంగోవర్ కాకుండా ఉంటారు. అలాగే ఆరోగ్యంపై కూడా ఎలాంటి ప్రభావం చూపకుండా ఉంటుంది.

    చాలా వరకు స్నేహితులతో మద్యం తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే వీరిలో కొందరు ఫోర్స్ చేసేవారు ఎక్కువగా ఉంటారు. ఇలాంటి సమయంలో తెలివిగా వారి కోసం ఒక్క పెగ్గునే చాలా సేపు తాగడం అలవాటు చేసుకోండి. దీంతో వారికి మర్యాద ఇవ్వడంతో పాటు తక్కువ మద్యం తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది.