https://oktelugu.com/

Hidden camera : హిడెన్ కెమెరాలను గుర్తించాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసా?

ప్రస్తుతం రోజుల్లో అయితే ఇలాంటి ఘటనలు ఎక్కువగా పెరిగిపోయాయి. ఈ కెమెరాలను కొందరు గుర్తించకపోవడం వల్ల మోసపోతున్నారు. జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ప్రాణాలే వదిలేస్తున్నారు. అయితే హిడెన్ కెమెరాలు ఉంటే వాటిని ఎలా గుర్తించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 25, 2024 / 11:17 PM IST

    Detect hidden cameras

    Follow us on

    Hidden camera : దేశంలో టెక్నాలజీ పెరిగే కొలది.. మంచి కోసం ఉపయోగించే వారి కంటే చెడు కోసం ఉపయోగించే వారే ఎక్కువ అయిపోయారు. ముఖ్యంగా మహిళలపై ఎక్కువగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. టెక్నాలజీ పెరగడంతో సీక్రెట్ కెమెరాలను అమర్చి ఎందరినో మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనల వల్ల చాలా మంది వారి జీవితాలను కూడా కోల్పోయారు. సాధారణంగా మనుషులు బయటకు వెళ్తుంటారు. ఇలా వెళ్లే సమయంలో బయట హోటల్స్‌లో ఉండటం, వాష్ రూమ్ వెళ్లడం వంటివి చేస్తుంటారు. కొందరు దుండగులు ఇలాంటి ప్రదేశాల్లో ఎవరికి తెలియకుండా కెమెరాలు పెడుతుంటారు. ప్రస్తుతం రోజుల్లో అయితే ఇలాంటి ఘటనలు ఎక్కువగా పెరిగిపోయాయి. ఈ కెమెరాలను కొందరు గుర్తించకపోవడం వల్ల మోసపోతున్నారు. జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ప్రాణాలే వదిలేస్తున్నారు. అయితే హిడెన్ కెమెరాలు ఉంటే వాటిని ఎలా గుర్తించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    గదిలో ఉన్న అన్నింటిని గమనించండి
    మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు హిడెన్ కెమెరాలను గుర్తించాలంటే ముందు గదిలో అన్ని వస్తువులను పరిశీలించాలి. అంటే మీకు ఏదైనా డౌట్ అనేపించే వస్తువులు ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వాలి. కొందరు గడియారాలు, గోడకు, తలుపులు ఇలాంటి ప్రాంతాల్లో హిడెన్ కెమెరాలు ఉండవచ్చు. కాబట్టి వీటిని ఒకసారి గమనించాలి.

    లైట్లు ఆఫ్ చేయాలి
    సీక్రెట్ కెమెరాలకు చిన్నగా లైట్ ఉంటుంది. మీరు గదిలోని లైట్లు అన్ని ఆపేసి, తలుపులు మూసేసి, కిటికీ గదులు కూడా మూసేస్తే ఎక్కడైనా చిన్న లైట్లు కనిపిస్తున్నాయో లేదో తెలుస్తుంది. చీకటి గదిలో మీకు ఎటు వైపు నుంచి లైట్లు వస్తే అక్కడ సీక్రెట్ కెమెరా ఉన్నట్లు గుర్తించవచ్చు.

    ఫ్లాష్ లైట్‌తో ఈజీగా..
    మొబైల్ ఫ్లాష్ లైట్‌తో ఈజీగా సీక్రెట్ కెమెరాను గుర్తించవచ్చు. చీకటి గదిలో మొబైల్ ఫ్లాష్ వేస్తే మీకు ఊదా లేదా నీలం రంగులో ఏదైనా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే కెమెరా లెన్స్‌ను మూసి వేయరు. రికార్డు చేయడానికి ఈ లెన్స్ తప్పకుండా ఉండాలి. అదే మీరు లైట్ వేస్తే ఈజీగా గుర్తించవచ్చు.

    అద్దాలు చూడాలి
    హోటల్స్‌లో అనవసరంగా ఎక్కడైనా అద్దాలు పెట్టారని అనిపిస్తే చెక్ చేయండి. ఎందుకంటే వాటిలో చిన్న కెమెరాలు దాగి ఉంటాయి. అలాగే చేయి పెట్టి అద్దాలను ఒకసారి చెక్ చేయండి. మీ వేలు పెడితే మధ్యలో గ్యాప్ వస్తే ఎలాంటి కెమెరాలు లేనట్లు. అదే గ్యాప్ రాకపోతే సీక్రెట్ కెమెరాలు ఉన్నట్లే. ఇలా ఏవైనా మీకు అనుమానంగా అనిపిస్తే వెంటనే అలర్ట్ కావాలి.

    స్మార్ట్ ఫోన్ సాయంతో..
    ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఇందులో కొన్ని యాప్‌ల ద్వారా హిడెన్ కెమెరాలను గుర్తించవచ్చు. నో హిడెన్ స్పై కెమెరా ఫైండర్, హిడెన్ కెమెరా డిటెక్టర్ స్పై సి, హిడెన్ స్పై కెమెరా డిటెక్టర్, హిడెన్ కెమెరా డిటెక్టర్ ప్రో వంటి యాప్‌లతో కూడా సీక్రెట్ కెమెరాలను కనిపెట్టవచ్చు. ఇవే కాకుండా ఇంకా చాలా యాప్‌లు ఉంటాయి.