https://oktelugu.com/

Balayya & Ram Charan : 2025 సంక్రాంతి బరిలో నిలుస్తున్న బాలయ్య రామ్ చరణ్…ఎవరి చేతిలో ఎవ్వరు ఓడిపోబోతున్నారు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫెస్టివల్ సీజన్ కి సినిమాలను భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో అయితే సినిమాలు భారీగా బరిలోకి రావడమే కాకుండా ఏ సినిమా సక్సెస్ అవుతుందనే విషయంలో చాలా రకాల ప్రశ్నలైతే తలెత్తుంటాయి... అందుకే ఈ సీజన్ కి ముందే చాలా మంది నిర్మాతలు మా సినిమా వస్తుంది అంటూ ముందుగానే కర్చీఫ్ లు వేస్తూ ఉంటారు..

Written By:
  • Gopi
  • , Updated On : October 26, 2024 / 08:50 AM IST

    Balayya Ram Charan who is standing in the ring of 2025 Sankranti... who is going to lose to whom?

    Follow us on

    Balayya & Ram Charan :2025 సంక్రాంతికి భారీ సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి. ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక గేమ్ చేంజర్ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ఆయన బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే బాలయ్య బాబు కూడా బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా సంక్రాంతి కానుకగా  ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. అయితే బాలయ్య బాబు రామ్ చరణ్ ల మధ్య భారీ పోటీ అయితే జరగబోతుంది. 2023 లో సంక్రాంతి కి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాలతో పోటీ పడినప్పటికి రెండు సినిమాలు కూడా సక్సెస్ సాధించడం అనేది అప్పట్లో ఒక పెను సంచలనంగా నిలిచింది. మరి ఇప్పుడు బాలయ్య బాబు రామ్ చరణ్ ఇద్దరి మధ్య ఎలాంటి పోటీ ఉండబోతుంది ఈ సమరంలో ఎవరు విజయం సాధించబోతున్నారనేది తెలియాల్సి ఉంది.
    ఇక మొత్తానికైతే బాలయ్య తనదైన రీతిలో సినిమా లను  పోస్ట్ పోన్ చేయకుండా సంక్రాంతి బరిలో నిలుపుతున్నాడనే విషయం తెలిసిన చాలామంది షాక్ అవుతారు. నిజానికి రామ్ చరణ్ కి పాన్ ఇండియాలో మంచి గుర్తింపైతే ఉంది. ఈ సినిమాతో రామ్ చరణ్ భారీ కలెక్షన్లను సాధిస్తాడని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ మాత్రం తెలుగులో తను సంక్రాంతికి తప్పకుండా సినిమా రిలీజ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు.
    కాబట్టి ఈ సినిమాని సంక్రాంతికి తీసుకొస్తానని అసలు తగ్గే ప్రసక్తే లేదని ఆయన చెప్పడం విశేషం… మరి వీళ్ళిద్దరిలో ఎవరు విజేతవుతారు అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ రామ్ చరణ్ కనక సూపర్ సక్సెస్ ని అందుకుంటే బాలయ్య బాబుకు ఘోర అవమానం జరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే తన కొడుకు సమానుడైన రామ్ చరణ్ చేతిలో ఓడిపోతే ఆయనకు భారీ దెబ్బ పడుతుందనే చెప్పాలి. రామ్ చరణ్ కనక బాలయ్య బాబు చేతిలో ఓడిపోతే పెద్దగా పోయేది ఏమీ లేదు.
    ఎందుకంటే తన తండ్రి తండ్రి సమానుడైన వ్యక్తి చేతిలో ఓడిపోయిన వాడు అవుతాడు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం అవ్వదని మెగా అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ఈ విషయాన్ని నందమూరి అభిమానులు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…ఏది ఏమైనా కూడా వీళ్ళు సంక్రాంతి బరిలో నిలవడం అనేది నిజంగా ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తుందనే చెప్పాలి…