India – Australia: క్రికెట్ అంటే ఇష్టముండని వారుండరు. చిన్నా, పెద్దా తేడా లేకుండా టీవీల్లో మ్యాచ్ వస్తే తప్పకుండా చూస్తారు.ఇక వరల్డ్ కప్ సమయంలో మ్యాచ్ ఉన్నన్ని రోజులూ పండుగలా నిర్వహించుకుంటారు. క్రికెట్ ఆటపై ఉన్న పిచ్చి.. దీనిని ఆడేవారిపై కూడా ఉంటుంది. దీంతో కొందరు ఆటగాళ్లంటే పడి చచ్చిపోతారు. తమ ఆటగాడు మైదానంలోకి వస్తే గుక్క పట్టుకొని మ్యాచ్ చూస్తారు. నాటి కపిల్ దేవ్ నుంచి నేటి కోహ్లీ వరకు క్రికెటర్లకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ల ఆటను కన్నార్పకుండా చూస్తారు. ఇప్పుడు వీళ్లకు విదేశాల్లోనూ ఫ్యాన్ష్ ఉన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆస్ట్రేలియాలోని కొన్ని స్ట్రీట్ లకు ఇండియన్ క్రికెటర్ల పేర్లు పెట్టారు. అయితే అందుకో కారణం ఉంది.

క్రికెటర్లకు దేశాలతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఉన్నారు. ఐపీఎల్ వచ్చినప్పటి నుంచి ప్రపంచ క్రికెటర్లంతా కలిసి పోతారు. తమ జట్టును గెలిపించేందుకు కలిసి పోరాడుతారు. ఈ క్రమంలో ఇండియన్ క్రికెటర్ల ఆటంటే విదేశాల్లో ఇష్టపడేవారు ఉన్నారు. మన ఇండియన్ క్రికెట్ టీంకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. దీంతో ఇక్కడి వారిని పరాయిదేశాల్లో దేవుళ్లుగా భావిస్తారు. ఈ తరుణంలో వారి గుర్తుంచుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పుడు వారి పేరిట వీధులను ఏర్పాటు చేశారు.
కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి లాంటి వారికి మనదేశంలోనే కాకుండా విదేశాల్లో అభిమానులు ఉన్నారు. వీరిపై ఉన్న అభిమానానికి గుర్తుగా వారి పేర్లను కొన్ని వీధులకు పెట్టుకున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లోని రాక్ బ్యాంక్ ప్రాంతంలోని ఓ ఎస్టేట్ లోని వీధులకు ‘టెండూల్కర్ డ్రైవ్’, ‘కోహ్లీ క్రెసెంట్’ ‘దేవ్ టెర్రెస్’ అని పేర్లు పెట్టారు. అయితే ఇక్కడ మనవాళ్ల పేర్లు పెట్టడానికి ఓ కారణం లేకపోలేదు. ఈ ప్రాంతంలో చాలా మంది భారతీయులు ఇళ్లను కొనుగోలు చేశారు. అందుకే ఈ పేర్లను పెట్టినట్లు సమాచారం.

ఇండియన్ క్రికెటర్లు సిరీసుల కోసం దేశ, విదేశాల్లో తిరుగుతూ ఉంటారు. అంతేకాకుండా వివిధ దేశాలతో తలపడుతూ ఉంటారు. దీంతో కొందరు ఫేర్లు ఫేమస్ అవుతూ ఉంటాయి. సచిన్ టెండూల్కర్ పేరు క్రికెట్ ఉన్న ఏ దేశంలో అడిగినా చెబుతారు.అలాగే ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా అంతే పాపులర్ సాధించాడు. అందుకే వీరి పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.