Aakasam Movie Review: నటీనటులు:
అశోక్ సెల్వన్, రీతూవర్మ, శివాత్మిక, అపర్ణ బాలమురళి, ఇషారెబ్బా, జీవా, శివదా, తదితరులు
సాంకేతికం:
డైరెక్టర్: రా కార్తీక్
నిర్మాత: శ్రీనిధి సాగర్, పీ రూపక్ ప్రణవ్ తేజ్,
సంగీతం: గోపి సుందర్
సినిమాటోగ్రఫీ: విధు అయ్యన్న
రిలీజ్ డేట్: 04-11-2022

ఈ మధ్య ప్రేమ, పెళ్లి రిలేషన్ షిప్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. మనుషుల మధ్య ఉన్న బంధాల గురించి తెలుపుతూ ఆకట్టుకుంటున్నాయి. ఈ కోవలోనే లేటెస్టుగా ‘ఆకాశం’ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
కథ:
అర్జున్ (అశోక్ సెల్వన్) సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఎవరితో ఎక్కువగా మాట్లాడరు. ప్రతీ విషయంలో కరెక్ట్ గా ఉండాలని చూసుకుంటాడు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి ఆయనకు పుస్తకాలు చదవడం అంటే బాగా ఇష్టం. అయితే అర్జున్ కు పెళ్లి జరిగిన రోజే తన భార్య ప్రియుడితో వెళ్లిపోతుంది. దీంతో అర్జున్ తీవ్ర మనస్థాపానికి గురవుతాడు. ఇలా డిప్రెషన్లోకి వెళ్లిన అర్జున్ వైద్యుల వద్ద ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాడు. ఈ క్రమలో ఓ డాక్టర్ అతనికి రెండు పుస్తకాలను ఇస్తుంది. వాటిని చదివిన తరువాత తన జీవితం మారిపోతుంది..ఇంతకీ ఏంటా పుస్తకాలు..? అనేది సినిమా అసలు స్టోరీ.
విశ్లేషణ:
సినిమా మొత్తం ఎమోషనల్ తో కూడుకొని ఉంటుంది. విపరీతమైన బావోద్వేగాలు కనిపిస్తాయి. అర్జున్ డిప్రెషన్ తరువాత కొత్త జీవితాన్ని వెతుక్కోవడానికి మీనాక్షి కోసం వెళుతాడు. మధ్యలో సుభద్ర కలుస్తుంది. వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే భారీ తుఫాన్ లో వీరికి ప్రమాదం జరిగిన ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ మొత్తం ఫన్నీగా సాగుతుంది. వీటితో పాటు సెంటిమెంట్ తోడవుతుంది. మొత్తంగా వీర, మీనాక్షి… అర్జున్ సుభద్రల రెండు జంటల ప్రేమకథలు ఆసక్తిగా సాగుతాయి. క్లైమాక్స్ మంచి మెసేజ్ ఇచ్చి ముగించారు.
ఎవరెలా చేశారంటే..?
అశోక్ సెల్వన్ విభిన్న పాత్రలో నటించాల్సి వచ్చింది. ఎక్కడా మైనస్ రాకుండా నటించాడు. ప్రతీ పాత్రలో ఆయన పర్ఫామెన్స్ కనిపిస్తుంది. రీతూవర్మ, శివాత్మిక, అపర్ణ బాలమురళీ నటన పీక్ష్ స్టేజికి వెళ్తాయి. వారి ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అతిథి పాత్లరో జీవా మంచి పాత్ర పోషించాడు.

సాంకేతికం ఎలా ఉందంటే..?
‘ఆకాశం’ మూవీని డైరెక్టర్ రా కార్తీక్ తీర్చిదిద్దాడు. ప్రతీ సన్నివేశాన్ని జాగ్రత్తగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆర్టిస్టుల మూడ్ ను మార్చడంలో సక్సెస్ అయ్యాడు. విధూ అయ్యన్న సినిమా టోగ్రఫీ ఆకట్టుకుంటుంది. సినిమా పాటల సంగతి ఎలా ఉన్నా బ్యాగ్రాండ్ మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. సినిమా నిడివి పెంచినా పాత్రల ఎమోషన్స్ లో కనిపించదు. అయితే ఎడిటింగ్ పనితీరు మెరుగు పడాల్సి ఉండేది.
ముగింపు: లవ్, ఎమోషనల్, సెంటిమెంట్.. ఇలా అన్ని రకాల భావాలు కలిగిన సినిమా ‘ఆకాశం’. హృదయం నుంచి వచ్చే ప్రేమ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. యూత్ తో పాటు అన్ని వర్గాలను ఈ సినిమా ఆకట్టుకుంటుంది.
రేటింగ్:
2.7/5