Atal Pension Yojana: ప్రస్తుత కాలంలో రిస్క్ లేకుండా డబ్బులను ఇన్వెస్ట్ చేసే స్కీమ్స్ లో పోస్టాఫీస్ స్కీమ్ ఒకటనే సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా స్థిరమైన ఆదాయాలను పొందే అవకాశం అయితే ఉంటుందని గుర్తుంచుకోవాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటని చెప్పవచ్చు. మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే అదిరిపోయే బెనిఫిట్స్ పొందవచ్చు.
18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు అని చెప్పవచ్చు. 18 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు నెలకు 42 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 60 సంవత్సరాల తర్వాత నెలకు 1,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. నెలకు 42 రూపాయలు కాకుండా 210 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం నెలకు 5,000 రూపాయల పెన్షన్ లభిస్తుంది.
Also Read: కేసీఆరే టార్గెట్ః బీజేపీ భీమ్ దీక్షలతో చెక్ పెట్టే యత్నం?
ఈ స్కీమ్ లో చేరేవాళ్లు చేరే వయస్సును బట్టి చెల్లించే ప్రీమియం మొత్తంలో మార్పులు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ఆదాయపు పన్ను శాఖ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. వయస్సును బట్టి ప్రీమియం చెల్లించే కాలం మారుతుంది. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను లేదా బ్యాంకును సంప్రదించి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది.
ఒకవేళ ఈ పెన్షన్ స్కీమ్ లో 40 సంవత్సరాల వయస్సులో చేరితే నెలకు 291 రూపాయలు చెల్లించి 1,000 రూపాయల పెన్షన్ పొందవచ్చు. నెలకు 1454 రూపాయలు చెల్లించడం ద్వారా 40 సంవత్సరాల వయస్సులో ఈ స్కీమ్ లో చేరేవాళ్లు 5,000 రూపాయల పెన్షన్ పొందవచ్చు.
Also Read: ఉద్యో గ సంఘాలను ప్రభుత్వం అడ్డుకుంటుందా? చలో విజయవాడను భగ్నం చేస్తుందా?