People : నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని సామెత ఉంది.. అందుకే చాలామంది సమాజంలో మంచి మాటలతో అందరినీ ఆకట్టుకోవాలని అంటూ ఉంటారు. అయితే కొందరి మాటల వల్ల ఎంతో ఆసక్తిగా ఉంటుంది. మరికొందరి మాటల వల్ల చికాకు కలుగుతూ ఉంటుంది. అయితే ఇదే సమయంలో కొందరు ఎదుటివారు చెప్పింది వినయంగా వింటూ ఉంటారు. మరికొందరు అస్సలు పట్టించుకోకుండా ఉండడమే కాకుండా తిరిగి వాదిస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఎక్కడ తగిలినా వారితో చాలా కష్టం అవుతుంది. అలాంటి వారితో ఎలా ఉండాలి? వారితో ఎలా ప్రవర్తించాలి?
చాలామంది చెబుతున్న మాట ఏంటంటే’ ఆయనతో వాగడం వేస్టు’ అని అంటూ ఉంటారు. ఎందుకంటే కొందరు ప్రత్యేకమైన గుణాన్ని కలిగి ఉంటారు. ఎదుటివారు ఏం చెప్పినా వినకుండా.. వారితో వితండవాదం చేస్తుంటారు. వితండవాదం చేయడమే కాకుండా వారిదే పైచేయి అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటివారు ఇంట్లో లేదా కార్యాలయాల్లో ఉంటూ ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారితో వాదించడం సమయం వృధా అవడమే అని చాలామంది మానసిక నిపుణులు అంటున్నారు.
Also Read : ప్రపంచంలో ధనవంతులు.. టాప్–10లో భారతీయులు!
అయితే కాస్త విషయం తెలిసిన వారితో వాదించడం వల్ల వారి నుంచి మనం కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. లేదా పూర్తిగా తెలియని వారితో వాదించడం వల్ల మనం వారికి కొత్త విషయాలను నేర్పించే అవకాశం ఉంటుంది. కానీ సగం తెలిసి లేదా సగం తెలియకుండా ఉండే వ్యక్తులతో వాదించడం వల్ల సమయం వృధా అని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే వీరితో వాదించడం వల్ల ఉన్న జ్ఞానం పోతుందని కొందరు అంటుంటారు. అంతేకాకుండా ఇలాంటి వారితో ఎక్కువగా మాట్లాడటం వల్ల తలనొప్పి వస్తుంది అని చెబుతున్నారు.
అయితే ఇలాంటివారు ఎవరైనా తారాసపడితే వారికి దూరంగా ఉండడమే మంచిది. అంతేకాకుండా వారు వితండవాదం చేసినప్పుడు ఊరికే కామ్ గా ఉండి వారితో సమానంగా తాత్కాలికంగా నడవడమే సరైన పద్ధతి అని అంటున్నారు. ఎందుకంటే వారితో సమానంగా ఉండడం వల్ల వారు ఎక్కువగా వాదించకుండా ఉంటారు. అలా వారు వాదించని పక్షంలో మనతో శత్రుత్వం తక్కువగా కలిగి ఉంటారు. లేకుంటే శత్రుత్వం పెరిగి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని అంటున్నారు.
అందువల్ల తెలిసి తెలియకుండా మాట్లాడే వారికి దూరంగా ఉండటమే మంచిదని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇలాంటివారు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఉన్నట్లయితే వారితో వాదించడం కంటే స్నేహపూర్వకంగా ఉండాలని అంటున్నారు.
ఇక చాలామంది తమదే పై చేయి అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వారితోను జాగ్రత్తగా ఉండాలి. తమదే పై చేయి అని వాదించేవారు ఎదుటివారి మాట వినకుండా ఉంటారు. అయితే తాత్కాలికంగా వారికి మద్దతుగా ఉండి ఆ తర్వాత నచ్చకపోతే వారికి దూరంగా ఉండటమే మంచిది. అలాకాకుండా వారితోనూ ఎక్కువగా వాదించడం వల్ల శత్రుత్వం పెరిగి అనేక ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది.