Bananas and Milk : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. రోజు ఎంత పని చేసినా.. ఎన్ని రకాలుగా బిజీ వాతావరణం లో గడిపిన ఆహార విషయంలో కొన్ని నియమాలు పాటించడం చాలా అవసరం అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే నేటి కాలంలో చాలామంది కొత్త కొత్త రుచులను కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఆహారంపై కూడా అవగాహన పెరగడంతో కొందరు కాంబినేషన్ ఆహారం తీసుకుంటూ ఉన్నారు. సాధారణంగా ఒకే రకమహారం తీసుకోవడం వల్ల కంటే కాంబినేషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల రెండు రకాలుగా ప్రోటీన్లు, పోషకాలు అందుతాయి. అయితే అన్ని రకాల పదార్థాలను కలిపి తినడం వల్ల ఆరోగ్యకరం కాదని కొందరు హెచ్చరిస్తున్నారు. కొన్ని పదార్థాలు కలిపి తినడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మరి అలా కలిపి తినకూడని పదార్థాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
Also Read : నల్ల మచ్చలున్న అరటిపండ్లు ఆరోగ్యానికి మంచివేనా.. వైద్యులేం చెప్పారంటే?
మిగతా ఆహార పదార్థాల కంటే మాంసకృతుల్లో ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి. అందుకే చాలామంది వీకెండ్స్ లో లేదా వారానికి రెండుసార్లు మాంసాహారం తినేందుకు ఇష్టపడతారు. అయితే మాంసాహారం తిన్న సమయంలో కొందరు ఫ్రూట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఫ్రూట్స్ వల్ల ఆంటీ యాక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. మాంసకృతుల వల్ల అదనపు ప్రోటీన్స్ అందుతాయి. అయితే మాంసాకృతుల్లోని ప్రోటీన్లు ఫ్రూట్స్ తినడం వల్ల వాటిని డైజేషన్ త్వరగా కాకుండా ఉంటాయి. అందువల్ల మాంసకృతులు, ఫ్రూట్స్ కలిపి తినకుండా ఉండాలి.
ప్రస్తుత కాలంలో చాలామంది అరటి పళ్ళు, పాలు కల్పినా స్మూతీని ఎక్కువగా తీసుకుంటూ ఉంటున్నారు. ఇది చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్లు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.
అన్నం తినేటప్పుడు చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. కానీ కూల్ డ్రింక్స్ లోని ఎంజాయ్ శరీరంలో ఉండే జీనక్రియను దెబ్బతిస్తాయి. ఫలితంగా తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాకుండా ఉంటుంది. అందువల్ల ఆహారం తినేటప్పుడు చల్లటి నీరు లేదా కూల్డ్రింక్స్ తీసుకోకుండా సాధారణ నీటిని మాత్రమే తీసుకోవాలి.
కొంతమంది ఉదయం పాలు తాగిన తర్వాత ఏదో ఒకటి తినాలని అనుకుంటారు. అయితే పాలు తర్వాత పండ్లు తినాలని కోరుకునే వారు కూడా ఉన్నారు. పండ్లు తినడం వల్ల హెల్తీగానే ఉంటారు. కానీ పాలు తాగిన వెంటనే నారింజ లేదా పులుపు కలిగిన పండ్లను తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. పాలల్లో కాల్షియంతో పాటు పొటాషియం అధికంగా ఉంటుంది. నారింజ పండ్లలో సిట్రస్ ఎక్కువగా ఉంటుంది. అయితే పాలను సిట్రస్ అరగకుండా చేస్తాయి. దీంతో కడుపు ఉబ్బరంగా తయారవుతుంది.
Also Read : అవునా.. ఈ అరటిపండ్లు తింటే నిజంగా చనిపోతారా.. అసలు నిజాలు ఇవీ..
కొంతమంది వెజ్ ఫుడ్ తినే సమయంలో కొన్ని రకాల పదార్థాలను కలిపి తింటారు. వీటిలో టమాటా తో పాటు కీరదోస కలిపి తింటారు. అయితే టమాటా లో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. కీరదోసలో సి విటమిన్ ను నాశనం చేసే గుణం ఉంటుంది. దీంతో టమాటా లోని సిట్రస్ తీర దోషాలోని పోషకాలు కలవడం వల్ల కడుపులో సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల ఈ రెండు కాంబినేషన్ల ఆహారం తీసుకోకుండా ఉండాలి.