Vastu Tips: ఇంట్లో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే డబ్బుకు కొదవ ఉండదు!

Vastu Tips: సాధారణంగా ప్రతి మనిషి ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఆ కలని సాకారం చేసుకోవాలంటే డబ్బులు ఎంతో ముఖ్యం. అయితే ఈ డబ్బు కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు.ఇలా ఎంతో కష్టపడి డబ్బును పోగు చేస్తున్నప్పటికీ కొందరి ఇంట్లో డబ్బు నిల్వ కుండా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వాస్తు చిట్కాలను పాటించడం వల్ల ఇంట్లో డబ్బు నిల్వ ఉండి ఆర్థిక ఇబ్బందులు […]

Written By: Kusuma Aggunna, Updated On : January 4, 2022 3:59 pm
Follow us on

Vastu Tips: సాధారణంగా ప్రతి మనిషి ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఆ కలని సాకారం చేసుకోవాలంటే డబ్బులు ఎంతో ముఖ్యం. అయితే ఈ డబ్బు కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు.ఇలా ఎంతో కష్టపడి డబ్బును పోగు చేస్తున్నప్పటికీ కొందరి ఇంట్లో డబ్బు నిల్వ కుండా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వాస్తు చిట్కాలను పాటించడం వల్ల ఇంట్లో డబ్బు నిల్వ ఉండి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీ కళలను సాకారం చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

Vastu Tips

Also Read: ఈ రాశుల వారికి ఈ యేడాది వివాహం తద్యం.. మిగిలిన వారి పరిస్థితి ఏంటో తెలుసా?

వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క ఇంటికి తూర్పు దిశలో లేదా ఉత్తర దిశలో ఉండాలి. ఇలా ఉండటం వల్ల మానసిక సంతోషం కలగడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మన ఇంట్లో పురోగతి ఉండాలంటే ఎప్పుడూ కూడా ఈశాన్యం మూల ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఈశాన్య మూలంలో స్పటికం ఉంచడం శుభప్రదం. అదేవిధంగా మన ఇంట్లో నీటి కుళాయిలు ఉంటే ఆ కుళాయిల నుంచి నీరు లీక్ అవుతూ ఉంటాయి. ఇలా నీరు వృధాగా పోతూ ఉంటే మన సంపద కూడా అలాగే కరిగిపోతుందని చెబుతారు. అందుకే ఇలాంటి వాటిని వెంటనే మరమ్మతు చేయాలి.

వ్యాపారరంగంలో నష్టాలను చవి చూసేవారికి బృహస్పతి గ్రహం బలహీనంగా ఉండటం వల్ల వ్యాపారంలో నష్టాలు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి. అలాంటివారు ప్రతిరోజు నీటిలో కాస్త పసుపు వేసుకొని ఇంటిని శుభ్రపరచడం వల్ల వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.మీ ఇంట్లో కనక దేవుడి గది దక్షిణ దిశలో ఉంటే ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతాయి. అందుకే దేవుడి గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి. అలాగే ఉత్తరం కుబేరుడికి ఎంతో అనువైన దిశ. అందుకే ఉత్తరదిశలో కుబేరుడుని ఉంచి పూజలు చేయడం ఎంతో ఉత్తమం. అలాగే ముళ్ళు కలిగిన చెట్లను మన ఇంటి ఆవరణంలో పెంచకూడదు.ఈ విధమైనటువంటి వాస్తు చిట్కాలను పాటించడం వల్ల మన ఇంట్లో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు.

Also Read: పెళ్లి వయసు మారితే.. జీవితమే మారుతుందా?

ఇవి కూడా చదవండి
1. ఏపీ సర్కార్ కు రాంగోపాల్ వర్మ సూటి ప్రశ్నలు.. సమాధానం చెప్పే దమ్ము ఉందా?
2. జగన్ వైపు దూసుకొస్తున్న షర్మిల ‘బాణం’..!
3. మీ బోడి పెద్దరికం ఎవరడిగారు? చిరంజీవిపై రెచ్చిపోయిన శ్రీరెడ్డి
4. యాంకర్ అనసూయ పిక్స్ వైరల్.. మేకప్ లేకుండా చూసి షాక్‌లో అభిమానులు!