Chanakya Niti: ఆచార్య చాణిక్యుడు నీతి గ్రంథం ద్వారా ఎన్నో విషయాలను తెలియజేశారు. చాణిక్య నీతి గ్రంథంలో ఒక మనిషి నడవడిక ఏ విధంగా ఉండాలి, ఎవరిని నమ్మాలి, మన జీవితం విజయపథంలో వెళ్లాలంటే ఎలాంటి పద్ధతులను అనుసరించాలి, జీవితంలో నిజమైన స్నేహితుడిని ఎలా గుర్తించాలి అనే విషయాల గురించి చాణిక్యుడు నీతి గ్రంథంలో ఎంతో అద్భుతంగా వివరించారు.మరి కొత్త సంవత్సరం మనం విజయపథంలో దూసుకుపోవాలంటే ఎలాంటి నియమాలను పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం..
సోమరితనం వదిలేయండి: మీ విజయానికి అతి పెద్ద శత్రువు మీ సోమరితనం. మీరు సోమరితనంగా వ్యవహరించడం వల్ల జీవితంలో ఏ విధమైనటువంటి విజయాన్ని అందుకోలేరు. మీ విజయాన్ని, మీ కష్టార్జితాన్ని నాశనం చేసే శక్తి సోమరితనానికి ఉంటుంది కనుక సోమరితనం వదిలేయడం ఉత్తమం.
వర్తమానంలో బ్రతకడం: గతం గురించి మనం ఎంత ఆలోచించినా మన సమయం వృధా అవుతుంది అందుకే గతంలో జరిగిన కొన్ని సంఘటనలను గుణపాఠాలుగా చేసుకొని వర్తమానంలో బ్రతకడం నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి విజయాలను అందుకుంటారు.
చెప్పుడు మాటలు వినకండి: కొన్నిసార్లు ఎవరైనా ఇతరుల గురించి మీ దగ్గర కొన్ని విషయాలు చెప్పినప్పుడు వెంటనే వాటిని నమ్మి ఆ విషయాలపై ప్రతిస్పందించడం మంచిది కాదు. ఇలా చెప్పుడు మాటలు విని ప్రతి స్పందిస్తే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు.అందుకే మీరు కళ్లారా చూసినప్పుడు మీరు విన్నప్పుడు మాత్రమే ఆ మాటలను పరిగణలోకి తీసుకోవాలి. చెప్పుడు మాటలను ఎలాంటి పరిస్థితులలో వినకూడదు.
ఎవరిని అవమానించ వద్దు: చాణిక్య నీతి గ్రంధం ద్వారా ఒక మనిషి చేసిన తప్పును కాలక్రమేణా అతడే అనుభవిస్తాడు. కనుక ఎవరిని కూడా అవమానించ కూడదు. కాలం ఎవరికీ సమాధానం చెబుతుంది. కనుక ఎల్లప్పుడూ ఎవరిని ఆహ్వానించకుండా మన మనసు ఎల్లప్పుడు స్వచ్చంగా ఉండేలా చూసుకోవాలి.