https://oktelugu.com/

Vastu Tips : ఇంటిపైన ఈ వస్తువులు పెడుతున్నారా? జాగ్రత్త..

నేటి కాలంలో ఇల్లు నిర్మించుకుందామంటేఅనువైన ప్రదేశం దొరకడం లేదు. దీంతో దొరికిన ప్రదేశంలోనే అడ్జస్ట్ అవుతున్నారు. ఇంటిలోపన ప్లేసు లేకపోవడంతో కొందరు పాడైపోయిన వస్తువులను భవనంపై ఉంచుతారు. భవనంపై పైగాన్ని స్టోర్ రూంగా వాడుకుంటారు. ముఖంగా ఇంటి నిర్మాణానికి ఉపయోగించిన వెదురు కర్రలను ఇంటిపైన వేస్తుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 9, 2024 / 05:39 PM IST
    Follow us on

    Vastu Tips :  ఇల్లు నిర్మించుకునేటప్పుడు వాస్తు ప్రకారం కొన్ని పద్ధతులు పాటిస్తాం. ఇల్లు వాస్తు లేకపోవడం వల్ల ఆ ఇంట్లో అన్నీ సమస్యలే ఎదుర్కొంటారని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. అలాగే ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులను కూడా క్రమ పద్ధతిలో ఉంచాలి. లేకుంటే ఆ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం వస్తువులు నిర్ణీత ప్రదేశంలో లేకపోతే ఆ ఇంటిపై లక్ష్మీదేవి ఆగ్రహం పొందిన వారవుతారని చెబుతారు. ఇంట్లో మంచి జరగాలని, డబ్బు రావాలని చాలా మంది దేవళ్లకు పూజలు చేస్తుంటారు. కొందరు ప్రత్యేకంగా విగ్రహాలను ప్రతిష్టించుకుంటారు. వ్రతాలు చేస్తూ నోములు నోచుకుంటారు. కానీ ఎన్ని పూజలు చేసినా కొన్ని వస్తువుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జే ఉంటుంది. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే వస్తువులను కొన్ని క్రమపద్ధిలో ఉంచాలి. అలాగే ప్రతీ వస్తువును పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇల్లులోని ప్రతీ ప్రదేశం ముఖ్యమైనది. అందువల్ల ప్రతీ మూలన పరిశుభ్రంగా ఉండాలని చూడాలి. అయితే కొందరు పాత వస్తువులు, పగిలిపోయిన పాత్రలు వంటివి ఇంటిపైన వేస్తారు. ఇంట్లో ప్లేసు లేకపోవడం వల్ల ఇంటిపైన వేస్తుంటారు. ఇలా వేయడం వల్ల ఇంటికి అరిష్టం అని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. ఇంటిపైన ఎటువంటి అపరిశుభ్రమైన వస్తువులు ఉండరాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వస్తువులు ఇంటిపైన అస్సలు ఉంచరాదని అంటున్నారు. మరి ఆ వస్తువులు ఏవో తెలుసుకుందామా..

    నేటి కాలంలో ఇల్లు నిర్మించుకుందామంటేఅనువైన ప్రదేశం దొరకడం లేదు. దీంతో దొరికిన ప్రదేశంలోనే అడ్జస్ట్ అవుతున్నారు. ఇంటిలోపన ప్లేసు లేకపోవడంతో కొందరు పాడైపోయిన వస్తువులను భవనంపై ఉంచుతారు. భవనంపై పైగాన్ని స్టోర్ రూంగా వాడుకుంటారు. ముఖంగా ఇంటి నిర్మాణానికి ఉపయోగించిన వెదురు కర్రలను ఇంటిపైన వేస్తుంటారు. వెదురు కర్రలు ఇంటిపైన ఉండడం వల్ల ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి.

    చాల మంది పాడైపోయిన వస్తువులు సైతం ఇంటిపైన వేస్తుంటారు. వీటిలో కుర్చీలు కూడా ఉంటాయి. ఇంటి ఇంటిపైన వేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటుంది. దీంతో ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ఏ పని చేసినా డబ్బు నిల్వదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. పగిలిన కుండలు కూడా ఇంటిపైన పెట్టరాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కొందరు పగిలిన కుండల్లో మొక్కలు పెంచడానికి ప్రయత్నిస్తారు. కానీ అలా చేయడం వల్ల ఇంట్లో ఇప్పటికీ అశాంతులు నెలకొంటాయని చెబుతారు.

    చీపురును లక్ష్మీతో భావిస్తారు. ఇంట్లో శుభ్రం చేసేది చీపురు అయినా దీనిని సక్రమమైన ప్రదేశంలో ఉంచాలి. ముఖ్యంగా దీనిని పాడైపోయిన చీపురును ఇంటిపైన వేయకూడదని అంటున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారని చెబుతున్నారు. కొంతమంది ఈమధ్య ఇంటిపైన తోటలు పెంచుుతున్నారు. అయితే వీటిల్లో ఎండిపోయిన చెట్లను అలాగే ఉంచుతున్నారు. ఇలా ఉంచడం వల్ల నెగెటివ్ ఎనర్జీ ప్రభావం ఉంటుందని వాస్తు శాస్త్రం తెలుపుతుంది.

    వీటితో పాటు ముళ్లు ఉన్న చెట్లను ఇంటిపైన పెంచకూడదని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. ముళ్లు ఉన్న చెట్లు పెంచుకోవడం వల్ల ఇంట్లో ఘర్షణ వాతావరణం ఉంటుంది. నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల కుటుంబ సభ్యులు అనారోగ్యాన బారిన పడుతూ ఉంటారు. ఇల్లు లోపల ఎంత శుభ్రం ఉంచుకోగలుగుతారో.. పైన కూడా అంతే పరిశుభ్రంగా ఉండడం వల్ల ఇల్లు సంతోషంగా ఉంటుందని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. అందువల్ల ఇంటిపైన ఎలాంటి పాడైపోయిన వస్తువులను వేయకుండా జాగ్రత్త పడాలి.