https://oktelugu.com/

This Week OTT Releases: భారతీయుడు 2 తో పాటు… ఈవారం ఓటీటీలో దుమ్మురేపనున్న సినిమాలు, సిరీస్ల లిస్ట్!

మరో వారాంతం వచ్చేసింది. అటు థియేటర్స్ లో ఇటు ఓటీటీలో కొత్త చిత్రాలు, సిరీస్ల సందడి నెలకొంటుంది. థియేటర్స్ లో అన్నీ చిన్న సినిమాలే విడుదలయ్యాయి. దాంతో ప్రేక్షకులు ఓటీటీ రిలీజులపై ఆసక్తి చూపుతున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : August 9, 2024 / 05:38 PM IST

    This Week OTT Releases

    Follow us on

    This Week OTT Releases:  అనసూయ నటించిన సింబా ఆగస్టు 9న విడుదలైంది. ఈ చిత్రంలో ఆమె ఓ సీరియస్ రోల్ చేశారు. జగపతిబాబు, గౌతమి ఇతర కీలక రోల్స్ లో నటించారు. మెగా డాటర్ నిహారిక నిర్మాతగా వ్యవహరించిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు. ఈ విలేజ్ డ్రామా సైతం ఈ వారం థియేటర్స్ లో విడుదల చేశారు. ఈ రెండు చిత్రాలతో పాటు భవనం, సంఘర్షణ అనే మరో రెండు చిత్రాలు ఆగస్టు 9న విడుదలయ్యాయి.

    మరోవైపు ఓటీటీలో కూడా సినిమాల సందడి మొదలైయింది. శుక్రవారం వచ్చిందంటే చాలు పలు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో పదుల సంఖ్యలో సినిమాలు, సిరీస్లు విడుదలవుతాయి. కొత్త సినిమాలు, సిరీస్ల కోసం ఎదురు చూసే ఓటీటీ ప్రియులకు ఈసారి పండగే. ఎందుకంటే ఒక్కరోజే ఏకంగా 12 సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి.

    కమల్ హాసన్-శంకర్ కాంబోలో తెరకెక్కిన భారతీయుడు 2 డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో స్ట్రీమ్ అవుతుంది. 1996లో వచ్చిన భారతీయుడు మూవీ ఇండస్ట్రీ హిట్. దేశాన్ని ఒక ఊపు ఊపిన చిత్రం అది. భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 తెరకెక్కింది. భారతీయుడు 2 చిత్రం జులై 12న థియేటర్స్ లో విడుదల చేశారు. మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొడుకును చంపిన సేనాపతి విదేశాలకు వెళ్ళిపోతాడు. ఇండియాలో తిరిగి అవినీతి పెరగడంతో రీఎంట్రీ ఇస్తాడు. భారతీయుడు 2 డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఆగస్టు 9 నుండి అందుబాటులోకి వచ్చింది.

    మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం టర్బో. ఈ మూవీలో సునీల్ విలన్ గా నటించాడు. మే 23న మలయాళంలో టర్బో విడుదలైంది. ఈ చిత్రం సైతం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. టర్బో డిజిటల్ రైట్స్ సోనీ లివ్ సొంతం చేసుకుంది. మే 9 నుండి మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. సునీల్, మమ్ముట్టి అభిమానులు చూసి ఎంజాయ్ చేయండి.

    మరికొన్ని క్రేజీ సిరీస్లు, సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు అందుబాటులో ఉన్నాయి. సదరు సినిమాలు ఏమిటీ? ఎక్కడ స్ట్రీమ్ అవుతున్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ..

    నెట్ ఫ్లిక్స్

    భారతీయుడు 2 – సినిమా – ఆగస్టు 9
    ఫైర్ ఆయీ హసీన్ దిల్ రుబా – హిందీ సినిమా – ఆగస్టు 9
    కింగ్స్ మెన్ గోల్డెన్ సర్కిల్ – ఇంగ్లీష్ సినిమా – ఆగస్టు 9
    మిషన్ క్రాస్ – కొరియన్ సినిమా – ఆగస్టు 9
    రొమాన్స్ ఇన్ ది హైస్ – కొరియన్ మూవీ – ఆగస్టు 1

    జియో సినిమా
    గుడ్చడీ – హిందీ సినిమా – ఆగస్టు 9

    జీ 5
    గ్యారా గ్యారా – వెబ్ సిరీస్ – ఆగస్టు 9

    డిస్నీ ప్లస్ హాట్ స్టార్
    లైఫ్ హిల్ గయి – వెబ్ సిరీస్ – ఆగస్టు 9
    ఖాతిల్ కౌన్ – వెబ్ సిరీస్ – ఆగస్టు 9

    ఆహా
    డెరిక్ అబ్రహం – మలయాళ సినిమా – ఆగస్టు 10
    7/జీ – తమిళ సినిమా – ఆగస్టు 9

    సోనీ లివ్
    టర్బో – సినిమా – ఆగస్టు 9