Vastu Tips: మామూలుగా మనలో ఎవరైనా పేరు పెట్టాలనుకుంటే ఎన్నో ఆలోచిస్తారు. పండితులకు చూపించడమే కాకుండా పెద్దల అభిప్రాయాలను తీసుకుని పేర్లు పెడుతుంటారు. అలాగే ప్రస్తుతం ఇంటికి కూడా పేరు పెడుతున్నారు. ట్రెండీ మారుతున్న ఈ వ్యవహారంలో కొన్ని వాస్తు చిట్కాలను పాటిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా ప్రతి వ్యక్తి తనకంటూ ఇల్లు ఉండాలని భావిస్తాడు. అందుకోసం కష్టపడి తాను సంపాదించిన ధనంలో కొంత మొత్తాన్ని వెచ్చించి తనకు నచ్చినట్లుగా ఇల్లును నిర్మించుకుంటారు.అయితే ఇందులో వాస్తు శాస్త్ర నియమాలను పాటిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటి గోడల రంగు, ఫర్నీచర్ ఎక్కడ పెట్టాలి, మొక్కల ఎంపక, ఇంటి పేరు సరిగ్గా ఎంచుకుంటే ఇల్లు అదృష్టాన్ని కలిగిస్తుందంట.
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి పేరుకు సానుకూల అర్థంతో ఉండే విధంగా ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వలన సానుకూల శక్తిని ఆకర్షిస్తుందంట. ఇంటి పేరు వలన వచ్చే శక్తిని ఆకర్షిస్తుందంటున్నారు. అలాగే ఇంటికోసం ప్రత్యేకంగా పేరును ఎంచుకోవాలి. మనం ఇంటికి పెట్టే పేరు వేరే పెట్టే విధంగా ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతున్నట్లు తెలుస్తోంది.
ఇంటి పేరు మీద ఎల్లప్పుడూ చిన్న బల్బును పెట్టాలి.ఈ విధంగా చేయడం వలన మీ ఇల్లు ఉత్తేజకరమైన శక్తితో నిండుతుంది. పేరు ప్రభావాన్ని మెరుగు చేయాలంటే ఇంటి పేరు ముందు లేదా పైన స్వస్తిక్ లేదా ఓం అనే చిహ్నాన్ని ఉంచాలని చెబుతున్నారు. అలాగే ఇంటి పేరును ఎప్పుడు రాయి లేదా చెక్కపై రాయాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ప్రధాన ద్వారం గేటుకు ఇంటి పేరు రాయకూడదట. కేవలం ప్రవేశ గోడపైనే ఉండాలని తెలియజేస్తున్నారు.