December 21st: భూమికి, సూర్యుడికి అవినాభావ సంబంధం ఉంటుంది. సూర్యుడు లేకుండా భూమిపై ఏ జీవి ప్రాణంతో ఉండదు. అలాగే మొత్తం సూర్యుడు ఉన్నా.. ఏ జీవి ప్రాణంతో నిలవదు. ఒక రోజులో దాదాపు 12 గంటల పాటు సూర్యుడి వెలుగు భూమిపై ఉంటుంది. ఆ తరువాత చీకటిగా మారుతుంది. అయితే ప్రతీ రోజు సూర్యుడి వెలుగు భూమిపై 12 గంటల పాటు ఉంటుందని చెప్పలేం. కొన్ని రోజుల్లో తక్కువ సమయంలో సూర్యుడు కనిపిస్తాడు. వీటిలో డిసెంబర్ 21 లేదా డిసెంబర్ 22న సూర్యడిది అతి తక్కువ సమయం అని చెప్పుకుంటారు. దీనినే అవయాంతం అని అంటారు. భారత కాల మానం ప్రకారం శీతాకాలంలో ఈ పరిస్థితి ఉంటుంది. అందువల్ల దీనిని శీతాకాలం అవయాంతం అని అంటారు. 2024 ఏడాదిలో డిసెంబర్ 21న శీతాకాలం అవయాంతం రాబోతుంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా సూర్యుడు భూమిపై డిసెంబర్ లో అతి తక్కువ సమయంలో కనిపిస్తాడు. ఆ రోజు డిసెంబర్ 21 కానుంది. ఈ రోజున సూర్యుడు భూమి దక్షిణ అర్ధగోళంలో అత్యున్నత బింధువులో ఉంటాడు. దీంతో భూమిపై పగలు తక్కువగా.. రాత్రి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున పగలు 8 గంటలు.. రాత్రి 16 గంటలు ఉండనుంది. దీనిని విదేశాల్లో సోల్స్టిస్ అని అంటారు. ఈ రోజున భూమి 23.4 డిగ్రీల వైపునకు క్రాస్ అయినట్లు పయనిస్తుంది. ఇప్పుడు సూర్యుడు దక్షిణయానం నుంచి ఉత్తరాయాణం వైపు వెళ్తాడు.
శీతాకాలపు అయనాంతం ఏర్పడిన రోజున భూమిపై ఉష్ణోగ్రతలోనూ మార్పు కనిపిస్తుంది. ఈరోజు భూమి మరింత చల్లగా మారే అవకాశం ఉంది.నవంబర్ నుంచి ఇప్పటికే చల్లటి వాతావరణం ఉంది. ఈ వారం రోజులు మరింత చల్లగా మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఆసియా దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా తూర్పు ఆసియా దేశమైన చైనాలో యిన్, యాంగ్ ప్రజలు ఐక్యతకు ప్రతిరూపమైన రోజుగా భావిస్తారు. భారత్ లో ఈరోజు గీతా పారాయణం చేస్తారు. శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాజస్థాన్ లో పుష్యమాస పండుగను నిర్వహించుకుంటారు.
సూర్యడు తక్కువగా ఉండే ఈ రోజును కొందరు మరో రకంగా చెప్పుకుంటారు. గ్రహాలకు అధిపతి సూర్యుడు. సూర్య గ్రహం దక్షిణయానం నుంచి ఉత్తరయాణం వైపు పయనించడం వల్ల సానుకూల పవనాలు వీస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 21 నుంచి సూర్యడు ధనుస్సు రాశిలో ప్రవేశించనున్నాడు. దీంతో కొన్ని రాశులపై సూర్యుడి ప్రభావం ఉండనుంది.కొన్ని రాశుల వారు తమకున్న చెడు అలవాట్లను, పాత విషయాలను పాత సంవత్సరంతో వదిలేయాలని అంటారు. కొత్త ఏడాదిలో సూర్యడి పయనం అందరికీ అనుకూలంగా ఉంటుంది. మకర సంక్రాంతి వరకు సూర్యుడి ప్రభావంతో కొందరి జీవితాల్లో మార్పులు రానున్నాయి. అనుకోకుండా అదృష్టం వాటిల్లే అవకాశం ఉంది.