
Are we healthy? : ప్రస్తుత కాలంలో ఆరోగ్యం మీద చాలా మంది శ్రద్ధ తీసుకుంటున్నారు. మనం తీసుకునే ఆహారం మన జీవనశైలిపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఫలితంగా భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నిత్యం మనం ఏ ఆహారాలు తీసుకుంటున్నాం? ఎలా తీసుకుంటున్నాం అనే విషయాల మీద ఫోకస్ పెడుతున్నారు. ఫలితంగా హెల్త్ కోసం ఎంతో కొంత సమయం కేటాయిస్తున్నారు. లేకపోతే ఆస్పత్రుల్లో పడటం కామన్. ఈనేపథ్యంలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు పట్టించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

మనం నిద్రపోయే సమయం
ఆరోగ్యవంతులు పడుకోవడంతో అరగంట సమయంలోనే నిద్రలోకి జారుకుంటే ఆరోగ్యంగా ఉన్నామని అర్థం. లేదంటే అనారోగ్యంతో ఉన్నట్లు లెక్క. అందుకే మనం నిద్రలోకి జారుకునే సమయం కూడా ముఖ్యమే. వెన్నంటుకుంటేనే కన్నంటుకుంటే మనకు సమస్యలు లేనట్లు. అదే మనం బెడ్ మీద పడుకున్నాక అటూ ఇటూ బొర్లుకుంటూ గంటల కొద్దీ నిద్రలోకి జారుకోలేదంటే మనం ఆరోగ్యంగా లేనట్లుగానే భావించుకోవాలి.
నెలసరి సక్రమంగా..
మహిళల్లో రుతుస్రావం సరైన సమయానికి వస్తే ఆరోగ్యంగా ఉన్నట్లు. లేదంటే అనారోగ్యాల బారిన పడినట్లుగానే అనుకోవాలి. కొందరైతే రెండు మూడు నెలలకోసారి ఉంటారు. ఇది కరెక్టు కాదు. బహిష్టు సరైన సమయానికిరాకపోతే ఇబ్బందులే. 21 నుంచి 45 రోజుల మధ్యలో పీరియడ్స్ రాలేదంటే ఆరోగ్యం మీద చెడు ప్రభావం పడినట్లుగా చెబుతారు.
అలసట ఉండకూడదు
మనం రోజువారీగా ఎన్నో పనులు చేస్తుంటాం. మనకు పనులు చేసే క్రమంలో అలసట రాకూడదు. పనులు చేసే కొద్ది ఉత్సాహం ఉరకలేయాలి. అంతే కాని నీరసం వస్తుందంటే మన ఆరోగ్యం దెబ్బతిన్నట్లే. ఏదో అనారోగ్యం దరిచేరినట్లే లెక్క. ఇలా మనం చేసుకునే పనుల్లో కూడా ఇనుమడించిన ఉత్సాహమే ఉండాలి కానీ నిరుత్సాహం రాకూడదు.
మలవిసర్జన
ప్రతి రోజు సరైన సమయానికే మలవిసర్జన రావాలి. పైగా కూర్చుకున్నామంటే ఠక్కున పని జరిగిపోవాలి. అంతే కాని మరుగుదొడ్డిలో గంటల కొద్ది కూర్చుంటే మనకు ఏదో వ్యాధి ఉన్నట్లే. మల విసర్జన ఆటంకాలు లేకుండా నిరాటంకంగా రావడం ఆరోగ్యవంతుల లక్షణం. ఇది కూడా చూసుకోవాలి. మన ఆరోగ్యంపై ఇది కూడా ప్రభావం చూపుతుందని తెలుసుకోవాలి.
మూత్రవిసర్జన
మూత్రం లేత పచ్చ రంగులో ఉండాలి. పైగా ధారగా పోయాలి. మూత్రం ఆగకుండా నిరాటంకంగా పోస్తే మంచిది. ఇది ఆరోగ్య వంతుడి లక్షణం. మెట్లు ఎక్కేటప్పుడు ఒక నిమిషంలో నాలుగు మెట్లు ఎక్కితేనే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. మనకు అయ్యే గాయాలు కూడా త్వరగా మానాలి. లేదంటే అనారోగ్యంతో ఉన్నట్లే. ఇలా మన ఆరోగ్యం విషయంలో వీటిని చూసుకుని మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేమా అనే విషయం నిర్ధారించుకోవచ్చు.