
Actress Prema: ‘కొంగు పట్టి లాగాడే.. కోరుకున్న ప్రియుడు’.. అనే సాంగ్ తో యూత్ తో గుబులు పుట్టించిన ప్రేమ గురించి ఎవరూ మరిచిపోరు. మొదట్లో నార్మల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రేమ ఆ తరువాత అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా ఆమె నటించిన ‘దేవి’ సినిమా ఇప్పటికీ మహిళా హృదయాల్లో నిలిచే ఉంటుంది. దేవత పాత్రలో ఆనాడు కేఆర్ విజయ మాత్రమే నటించి ఆకట్టుకోగా.. ఆ తరువాత ప్రేమ కు మాత్రమే ఈ క్యారెక్టర్ షూట్ అవుతుందన్న నమ్మకం కలిగించారు. ప్రేమ నటించిన ఎన్నో సినిమాలు సక్సెస్ అయ్యాయి. అంతేకాకుండా స్టార్ హీరో ల పక్కన నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె పర్సనల్ లైప్ కాస్త గజిబిజిగానే మారిందని చెప్పుకోవచ్చు. అందరిలాగే పెళ్లి చేసుకొని జీవితాన్ని కొనసాగించాలనుకున్న ఆమె కల నెరవేరలేదు. కొన్నాళ్లకే భర్తతో విడాకులు తీసుకొని ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.
బెంగుళూరుకు చెందిన ప్రేమ కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఉపేంద్ర డైరెక్షన్లో వచ్చిన ‘ఓంకారమ్’ సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన ఈ మూవీ కన్నడంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కావడంతో ఫస్ట్ మూవీతోనే ఫేమస్ అయింది. అయితే కన్నడం కంటే తెలుగు సినిమాలతోనే ప్రేమకు స్టార్ ఇమేజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సినిమాల్లో ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో జీవించే ఆమె నటించిన సినిమాలు దాదాపు సక్సెస్ అయ్యాయి. అయితే ఆమె పర్సనల్ లైఫ్ గురించి చాలా మంది ఇంటర్వ్యూలో అడగడానికి సాహసం చేయలేదు. కానీ ఇటీవల ఓ ఛానెల్ లో ఆమె విడాకుల గురించి అడగగా ఆమె ఆసక్తికర విషయాలు చెప్పింది.

ప్రేమ ప్రస్తుతం బెంగుళూర్ లో ఒంటరిగానే ఉంటోంది. ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఆమె ఒక్కరే ఉంటున్నా సంతోషంగా ఉంటున్నానని చెబుతోంది. అయితే ఆమెను విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చందని అడగగా.. ఆమె షాకింగ్ రిప్లై ఇచ్చింది. ఈ విషయంపై నన్ను ఇప్పటి వరకు ఎవరూ అడగలేదని చెప్పారు. అయితే దీని గురించి నేను మీడియాతో కంటే నా తల్లిదండ్రులతోనే ఎక్కువగా మాట్లాడుతానని తెలిపింది. వృత్తి పరంగా ఎలాంటి ప్రశ్నలు వేసినా ఆన్సర్ చెబుతానని.. పర్సనల్ లైఫ్ ఈజ్ పర్సనల్.. మరోసారి ఈ విషయంపై అడగొద్దూ.. అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
ఆమె చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో హాట్ గా వైరల్ అవుతోంది. అమాయకంతో పాటు కట్టలు తెచ్చుకునే కోపంతో కనిపించే ప్రేమ ఆ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్ట్రాట్ చేశారు. అయితే కొన్ని రోజులుగా కొనసాగి ఆ తరువాత కనిపించకుండా పోయారు. ఇటీవల ఆమెకు సంబంధించిన ఇంటర్వ్యూలు బాగా వైరల్ అవుతున్నారు. అయితే మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా? అని అడగగా… మంచి పాత్ర వస్తేనే నటిస్తానని పేర్కొంటోంది.