Family Tour: ఒకేసారి రెండు ఫ్యామిలీలు కలిసి విహారయాత్రలకు వెళ్లాలని అనుకుంటారు. ఈ సమయంలో ప్రత్యేకంగా వాహనాన్ని అద్దెకు తీసుకొని ప్రయాణాలు ప్రారంభిస్తారు. అయితే అద్దెకు కారు తీసుకోవడం వల్ల ఖర్చులు ఎక్కువగా మారుతున్నాయి. అంతేకాకుండా ఈ కాలంలో నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి విహారయాత్రలకు లేదా ఇతర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీంతో సొంతంగా కారు ఉండాలని కోరుకుంటున్నారు. కుటుంబంలో నలుగురి కంటే ఎక్కువగా ఉన్నవారు కాస్త పెద్ద కారు కొనాలని చూస్తారు. వీరికి సెవెన్ సీటర్ కారు అనుకూలంగా ఉంటుంది. అయితే సెవెన్ సీటర్ కారు తక్కువ ధరతో పాటు మంచి మైలేజ్ ఇస్తే బాగుంటుందని అనుకునేవారు చాలామంది ఉన్నారు. వీరి కోసం కొన్ని కార్లు మార్కెట్లో ఇప్పటికే ఆదరణ పొందాయి. అయితే బెస్ట్ సెవెన్ సీటర్ కార్లు ఏవో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ వివరాల్లోకి వెళ్ళండి.
2024 క్యాలెండర్ ప్రకారం కొన్ని సెవెన్ సీటర్ కారులను గుర్తించారు. వీటిలో టాటా పంచ్ ఒకటి. ఈ కారులో 2024 ఏడాదిలో చాలామంది సొంతం చేసుకున్నారు. కంపెనీ తెలిపిన లెక్కల ప్రకారం 2,02,031 యూనిట్లు విక్రయాలు చేసుకుంది. దీంతో సెవెన్ సీటర్ టాప్ సెల్లింగ్ కారుగా టాటా పంచ్ నిలిచింది. టాటా పంచ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది. అలాగే 1.2 లీటర్ Cng ను కూడా అమర్చారు. ఇది 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు
5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 88 బీహెచ్పీ పవర్ తో పాటు 115 ఎంఎం టార్క్ తో పనిచేస్తుంది. దీనిని ప్రస్తుతం రూ 6.13 లక్షల నుంచి రూ .10.15 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
సెవెన్ సీటర్ సెగ్మెంట్లో మరో కంపెనీ కారు కూడా ఆకట్టుకుంటుంది. అదే మహేంద్ర. ఈ కంపెనీకి చెందిన స్కార్పియో 2024 ఏడాదిలో 1,66,364 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే గత ఏడాది మారుతి సుజుకి ఎర్టిగా రెండో స్థానంలో నిల్వగా.. ఈసారి ఆస్థానాన్ని మహేంద్ర స్కార్పియో ఆక్రమించింది. మహేంద్ర స్కార్పియో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 103 బిహెచ్పి పవర్ 137 ఎంఎం టార్క్ తో ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ లో పనిచేసే ఈ కారు లీటర్ ఇంధనానికి రూ .20.51 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ మోడల్ ప్రస్తుతం రూ. 13.85 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
మహేంద్ర స్కార్పియో తర్వాత మారుతి ఎర్టిగా అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది 7 సీటర్ కారు అయినప్పటికీ ఇందులోని ఫీచర్ల ఆధారంగా చాలామంది వినియోగదారులు ఆకర్షితులు అవుతున్నారు. ఇందులో 9 అంగుళాల స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం తో పాటు స్మార్ట్ ప్లే ప్రో టెక్నాలజీ కలిగి ఉంది. వాయిస్ కామెంట్రీ, కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. సేఫ్టీ కోసం 360 డిగ్రీ సరౌండింగ్ కెమెరా అమర్చారు. ఆటో హెడ్ లైట్స్ క్రూజ్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఇందులో కనిపిస్తాయి. ఈ మోడల్ ప్రస్తుతం మార్కెట్లో రూ. 8.69 లక్షల ప్రారంభ ధరతో కలిగి ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ రూ. 13.03 తో విక్రయిస్తున్నారు.