https://oktelugu.com/

CM Chandrababu : నారావారిపల్లెలో దేవాన్ష్.. పిల్లలతో అల్లరి..చంద్రబాబు రియాక్షన్ చూస్తే..!

 నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు పాల్గొన్నారు సీఎం చంద్రబాబు( CM Chandrababu). నారా కుటుంబ సభ్యులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు సైతం హాజరయ్యారు.

Written By:
  • Dharma
  • , Updated On : January 13, 2025 / 06:30 PM IST

    Naara Devansh

    Follow us on

    CM Chandrababu : సాధారణంగా ఏడుపదుల వయసులో ఉన్నవారు కుటుంబాలను చూసి సంతృప్తి పడతారు. మనవలు, మనవరాలను చూసి మురిసిపోతుంటారు. అందులోనూ పదేళ్లలోపు పిల్లలను చూస్తే వారి ఆనందమే వేరు. వారి చేష్టలను చూసి ముగ్దు లవుతుంటారు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) కూడా మనవడు దేవాన్సును ( Devansh)చూసి ఇట్టే మురిసిపోయారు. ఇందుకు చిత్తూరు జిల్లా నారావారిపల్లె వేదిక అయ్యింది.  చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు నందమూరి తో పాటు నారా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రస్తుతం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో చంద్రబాబు మనవడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
     * కుటుంబంతో సహా హాజరు 
     ఏటా ఎంత బిజీగా ఉన్నా.. చంద్రబాబు( Chandrababu) కుటుంబ సమేతంగా కుప్పం వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఒక్క నారా కుటుంబమే కాదు.. నందమూరి కుటుంబం సైతం కుప్పంలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం ఏటా చూస్తుంటాం. ఈ ఏడాది కూడా నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మరోవైపు దేవాన్ష్ నారావారిపల్లెలో అందరి పిల్లలతో కలిసిపోవడం ఆకట్టుకుంది. దేవాన్ష్ రావడంతో చాలామంది పిల్లలు చంద్రబాబు ఇంటి వద్దకు చేరుకున్నారు. వారితో ఎంతో సన్నిహితంగా గడిపాడు దేవాన్స్. మరోవైపు నారావారిపల్లె మొత్తం సాధారణ పిల్లాడి మాదిరిగా తిరుగుతూ కనిపించాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మనవడు, ఆపై మంత్రి కుమారుడు అయినా.. చాలా సింపుల్ గా అందరితో కలివిడిగా కనిపించాడు నారా దేవాన్ష్.
     * చిన్నారులకు వినూత్న పోటీలు
     మరోవైపు నారావారిపల్లెలో( Nara varipalli ) సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంగా చిన్నారులకు వినూత్న పోటీలు నిర్వహించారు. గొనె సంచుల్లో దిగుతూ నడక పోటీలు నిర్వహించారు. అందులో దేవాన్ష్ పాల్గొన్నారు. తోటి చిన్నారులతో కలిసి నడక పోటీలో ఉత్సాహంగా అడుగులు వేశారు దేవాన్స్. అయితే మనవడిని చూసి తెగ మురిసిపోయారు చంద్రబాబు. వేదిక పైనుంచి చూస్తూ చంద్రబాబు అసాంతం మనవడిని చూసి ఆనందపడ్డారు. మరోవైపు నానమ్మ భువనేశ్వరి సైతం మనవడిని ప్రోత్సహించారు. తల్లి నారా బ్రాహ్మణి కుమారుడిని ఫోటోలు తీస్తూ కనిపించారు. నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ భార్య వసుంధర దేవి, ఇతర కుటుంబ సభ్యులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
     * అన్ని అంశాల్లో ముందంజ
     దేవాన్ష్ ( Devansh)విషయంలో చంద్రబాబు ఆలోచన గొప్పగా ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే దేవాన్ష్ చదువుతో పాటు అన్ని అంశాల్లో ముందుంటున్నాడు. మొన్నటికి మొన్న చెస్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచాడు. ప్రపంచ రికార్డు సైతం సాధించాడు. అయితే నారావారిపల్లెలో సామాన్య పిల్లాడి మాదిరిగానే సందడి చేస్తూ దేవాన్సు కనిపించడం విశేషం.