Damaged currency notes: వస్తువులు కొనుగోలు చేయడానికి.. అవసరాలు తీర్చుకోవడానికి ప్రస్తుత రోజుల్లో డబ్బు చాలా ముఖ్యం. అయితే డబ్బులు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాయిస్ రూపంలో ఉండే డబ్బు కంటే పేపర్ రూపంలో ఉండే డబ్బు చాలా సౌకర్యంగా ఉంటుంది. అందుకే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనీ పేపర్ రూపంలోనే చలామణి అవుతోంది. అయితే కాగితం రూపంలో ఉన్న డబ్బును చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయినా కూడా కొన్ని కారణాలవల్ల ఈ డబ్బు డామేజ్ అవుతూ ఉంటుంది. వర్షం వల్ల లేదా ఇతర కారణాలవల్ల నోట్లు చిరిగిపోతూ ఉంటాయి. అయితే చాలామంది ఈ చిరిగిన నోట్లోను కమిషన్ తీసుకొని తిరిగి డబ్బులు చెల్లిస్తారు. కానీ బ్యాంకులు ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోకుండా చిరిగిన నోట్లకు సమానమైన డబ్బులు చెల్లిస్తారు. అది ఎలా అంటే?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం.. ఒక వినియోగదారుడు తమ దగ్గర ఉన్న డ్యామేజ్ కరెన్సీని బ్యాంకులో ఇచ్చి ఎందుకు అందుకు సమానమైన విధంగా డబ్బులు పొందవచ్చు. రూ 10 కంటే ఎక్కువ విలువ ఉన్న నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చు. అయితే ఇలా మార్చుకోవడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. సహకార, గ్రామీణ బ్యాంకులో మినహా మిగతా ఏ బ్యాంకు లోనైనా ఈ నోట్లను మార్చుకోవచ్చు. చిరిగిన నోట్లు మార్చుకోవాలంటే బ్యాంకులో ప్రత్యేకంగా అకౌంటు ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎంత విలువ కలిగిన నోట్లను ఇస్తామో.. అంతే సమానంగా తిరిగి డబ్బులను ఇస్తారు. అయితే రూ.5,000 కంటే ఎక్కువగా తిరిగిన నోట్లో ఉంటే వాటిని బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
డ్యామేజ్ అయిన నోట్లకు అందుకు సమానంగా డబ్బు రావాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. కరెన్సీ ఉద్దేశపూర్వకంగా చిరిగినదై ఉండరాదు. అలాగే చిరిగిన నోటుపై గాంధీ బొమ్మ తప్పనిసరిగా ఉండాలి. సీరియల్ నెంబర్ చెరిగిపోకుండా ఉండాలి. ఇలా ఉంటేనే నోటు మార్పుకు అవకాశం ఉంటుంది. డ్యామేజీని బట్టి రిటర్న్ అమౌంటును ఇస్తారు. 50 శాతం కంటే ఎక్కువగా డ్యామేజ్ అయితే కొంతవరకు కమిషన్ తీసుకుంటారు. అంతకుమించి ఎక్కువగా అయితే మరింతగా పెరుగుతుంది. అయితే 50% లోపు అయితే సమానమైన డబ్బులు ఇస్తారు. ఒక వ్యక్తి ఒకేసారి 20 చిరిగిన నోట్లను మార్చుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో మార్చుకోవాల్సి ఉంటే ముందే బ్యాంకు ను సంప్రదించాల్సి ఉంటుంది. బ్యాంకు నిబంధనల ప్రకారం నోట్లను మార్చుకోవాల్సి ఉంటుంది.