PM Modi celebrates Christmas: క్రిస్మస్ సందర్భంగా భారత్ లో జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు ప్రధాని మోడీ స్వయంగా ఢిల్లీ చర్చీలో ప్రార్ధనలు జరిపారు. అదే సయమంలో బయట అల్లరిమూకలు క్రిస్టియన్ల మీద దాడులు చేయడం గర్హనీయం. అనేక చోట్ల రాయపూర్ లో షాపింగ్ మాల్ బయటపెట్టిన క్రిస్టియన్ డెకరేషన్లను ధ్వంసం చేశారు. ఢిల్లీలో క్రిస్టియన్ దుకాణాలపై దాడులు.. అస్సాంలో క్రిస్మస్ ట్రీని తగులబెట్టారు. స్కూళ్లలో జరుపకూడదని బెదిరించారు. జబల్ పూర్ లాంటి చోట మహిళలను అరాచ్ చేశారు. ఈ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
భజరంగదళ్ లాంటి సంస్థలు ఇందులో పాల్గొన్నాయనేది ఈ వార్తల సారాంశం. ఒకవైపు మోడీ ప్రత్యక్షంగా చర్చిలో ప్రార్ధనలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీకి ఇలాంటి భజరంగ్ దళ్ ఆగడాలపై కంట్రోల్ లేకుండా పోతోంది. ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేయాల్సి ఉన్నా వాళ్లు పట్టించుకోవడం లేదు. దీంతో భజరంగ్ దళ్ రెచ్చిపోతుంది. మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ గా బాధ్యత తీసుకొని భజరంగదళ్ హిందుత్వ తమ అనుబంధ సంస్థలపై ఇలాంటివి చేయవద్దని ఇన్ స్ట్రక్షన్ ఇవ్వాల్సి ఉంది.
కేంద్రహోంశాఖ, రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇలాంటివాటిపై చర్యలు తీసుకుంటే మరోసారి పునరావృతం కాకుండా ఉంటాయి. మోడీ క్రిస్మస్ సంబరాల్లో పాల్గొనడంతో క్షేత్రస్థాయిలో ఇలాంటివి జరగకుండా ఉండాల్సి ఉంది.
ప్రధాని మోడీ చర్చి ప్రార్థనల్లో బయట క్రిస్టియన్ల పై దాడులు.. దేశంలో పరిస్థితులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
