Astrology- November 22: నవంబర్ 11న శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. నవంబర్ 13న బుధుడు, 16న సూర్యుడు సంచరిస్తారు. ఈ మూడు గ్రహాలు ఒకే రాశిలోకి సంచరించడంతో 12 రాశుల వారికి ఏ ప్రభావం చూపించబోతున్నాయో తెలుసుకుందాం. అక్టోబర్ 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్ర గ్రహణం ఏర్పడనుండటంతో ద్వాదశ రాశుల వారికి కొంత ప్రతికూల ప్రభావమే కనిపిస్తోంది. కానీ శుక్ర గ్రహ సంచారం చేత మూడు రాశులకు మాత్రం బాగుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటో ఓ సారి లుక్కేద్దాం.

శుక్రుడు, బుధుడు, సూర్యుడి సంచారం వల్ల కర్కాటక రాశి వారికి మేలు కలగనుంది. అన్నింటా విజయమే లభిస్తుంది. కెరీర్ లో ఉన్నత స్థానం అందుకుంటారు. కారోబార్ ఉద్యోగం చేసేవారికి అత్యంత అనుకూలమైన కాలం. ఈ గ్రహాల ప్రభావం చేత ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఎన్నో రోజులుగా వేధిస్తున్న పనులు పూర్తవుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవడం వల్ల సంతోషం కలుగుతుంది.
సింహరాశి వారికి కూడా ఎంతో మంచి జరుగుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ప్రశాంత వాతావరణం కలుగుతుంది. బుధ గ్రహ అనుకూలం వల్ల అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కొత్తగా ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేస్తారు. సూర్యుడి అనుగ్రహం చేత వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావడంతో మానసిక సంతోషం కలుగుతుంది. సూర్యుడి సంచారం వల్ల ఇంకా మంచి ఫలితాలు అందుకునేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

తులా రాశి వారికి కూడా అనుకూలమైన కాలమే. పెటటుబడికి తగిన సమయం. ఆదాయం పెరుగుతుంది. డబ్బు ఆదా చేసుకుంటారు. సూర్యుడి అనుగ్రహం చేత ఈ రాశి వారికి విదేశీ యానం అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉంటుంది. దీంతో ఏ పని కావాలన్నా చకచకా అయిపోతుంది. ఇంకా వృశ్చిక రాశివారికి కూడా మంచి కాలమే నడుస్తుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. పురోగతి బాగుంటుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి.