Ashu Reddy: జూనియర్ సమంతగా పాప్యులర్ అయిన అషురెడ్డి ఇంస్టాగ్రామ్ వేదిక చేస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఆమె స్కిన్ షో నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. మొహమాటం పక్కన పెట్టేసి పరువాల ప్రదర్శనకు తెగించింది. అషురెడ్డి తాజా ఫోటో షూట్ బౌండరీలు బ్రేక్ చేసింది.వైట్ బాడీ కాన్ డ్రెస్ ధరించి టూ మచ్ గ్లామర్ షో చేసింది. అషురెడ్డి బోల్డ్ నెస్ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంటే, కామెంట్స్ రూపంలో రచ్చ చేస్తున్నారు. అషురెడ్డి ఫోటో షూట్ వైరల్ గా మారింది.

సోషల్ మీడియా సెలబ్రెటీగా అషురెడ్డి వెలుగులోకి వచ్చింది. చూడడానికి ఒళ్ళు చేసిన సమంతలా ఉండే అషురెడ్డి జూనియర్ సమంతగా ఫేమ్ తెచ్చుకున్నారు. 2019లో ఆమెకు బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ దక్కింది. ఆ పరిణామం అషురెడ్డికి బాగా కలిసొచ్చింది. అప్పటి వరకు సోషల్ మీడియా జనాలకు మాత్రమే తెలిసిన అషురెడ్డి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
బిగ్ బాస్ హౌస్లో సైతం అషురెడ్డి గ్లామర్ షో ఏమాత్రం తగ్గలేదు. స్కిన్ షోనే నమ్ముకున్నట్లు ఆమె డ్రెస్సింగ్ ఉండేది. అయితే అషురెడ్డి స్ట్రాటజీ పెద్దగా వర్కవుట్ కాలేదు. జస్ట్ ఐదు వారాలకే ఆమె కథ ముగిసింది. 35వ రోజు ఎలిమినేటై బయటకు వచ్చేసింది. అప్పటి నుండి ఆమెకు బుల్లితెర అవకాశాలు మెరుగయ్యాయి.

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో అషురెడ్డి ఎఫైర్ నడుపుతున్నారనే పుకార్లు ఉన్నాయి. తరచుగా వీరిద్దరూ కలుస్తారు. స్నేహానికి మించి అత్యంత సన్నిహితంగా ఉంటారు. స్నేహానికి మించి ఇంకేదో ఉంది అన్నట్లు అషురెడ్డి-రాహుల్ ప్రవర్తన ఉంటుంది. కాగా బిగ్ బాస్ హౌస్లో రాహుల్ కంటెస్టెంట్ పునర్నవితో ఎఫైర్ నడిపారు. టైటిల్ గెలిచి బయటకు వచ్చాక కూడా అతడు కొన్నాళ్ళు పునర్నవితో సన్నిహితంగా ఉన్నాడు.

ఈ మధ్య అషురెడ్డి ఇంస్టాగ్రామ్ లో మాత్రమే కనిపిస్తున్నారు. బుల్లితెర షోస్ లో కూడా పాల్గొనడం లేదు. ఇక బర్త్ డే గిఫ్ట్ గా రూ. 75 లక్షల విలువైన బెంజ్ కారు అషురెడ్డికి వాళ్ళ ఫాదర్ ఇచ్చారు. వైట్ బెంజ్ కారు పక్కన నిల్చొని ఫోజులిచ్చిన అషురెడ్డి కలల కారు సొంతం చేసుకున్నందుకు ఆనందం వ్యక్తం చేసింది. ఫ్యాన్స్ ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేశారు.