Girls : భారతదేశంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పూర్వ కాలం నుంచి వివాహ విషయంలో కొన్ని నిబంధనలు ఏర్పాటు చేశారు. పెద్దలు, కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగే ఈ వివాహ కార్యక్రమంలో ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలు కలిసిపోతాయి. అలా కలిసిన వారు జీవితాంతం కలిసి ఉండాలని కొన్ని నిబంధనలు పెట్టారు. కోర్టులో సైతం వివాహానికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి.ఒకప్పుడు పెళ్లి తంతును వారం రోజుల పాటు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఒక్కరోజులో ముగించేస్తున్నారు. అంతేకాకుండా ఈ పెళ్లి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న సమయంలో ఊహించని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి ఒకరికి జరగాల్సిన పెళ్లి మరొకరికి జరుగుతుంది. అయితే ఓ యువకుడు తనకు జరిగిన పెళ్లి గురించి సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. తన అన్నయ్యను చేసుకోవాల్సిన అమ్మాయి తనను పెళ్లి చేసుకుందని చెప్పాడు. ఆ తరువాత ఏం జరిగిందంటే?
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడుతాయి అని అంటారు. ఒక్కోసారి కోరుకున్న అమ్మాయి ఆ అబ్బాయికి దక్కకపోవచ్చు. చివరి నిమిషంలో మరో వ్యక్తితో వివాహం జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా చివరి నిమిషంలో ఆగిపోయిన పెళ్లిళ్లు కూడా ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఒకరు చేసుకోవాల్సిన పెళ్లిని మరొకరు చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఒక అమ్మాయి తన భర్త అని ఒక వ్యక్తిని ఊహించుకున్న తరువాత సడెన్లీగా తన లైఫ్ లోకి మరో వ్యక్తి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? తనకు ఎదురైన అనుభవాన్ని ఓ వ్యక్తి సోషల్ మీడియాతో పంచుకున్నాడు.
కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తున్న ఓయువకుడు సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే తనకో అన్నయ్య ఉన్నాడు.ఇంట్లో పెద్ద వాడు కనుక అన్నీ బాధ్యతలు తనపైనే ఉన్నాయి. దీంతో ఇంట్లో వాళ్లంతా అతనికే ప్రాధాన్యం ఇచ్చేవారు. అన్నయ కనుక పెళ్లి కూడా ముందే చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి పెళ్లి నిశ్చయించారు. కార్ట్స్ కూడా ప్రింట్ అయ్యాయి. మరో వారం రోజుల్లో పెళ్లి. కానీ ఇంతలో షాకింగ్ విషయం. తన అన్నయ్యకు యాక్సిడెంట్. తీవ్ర గాయాలు. ఈ సమయంలో పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆ కుటుంబ సభ్యులు అనుకోని నిర్ణయాన్ని తీసుకున్నారు.
అన్యయ్య చేసుకోవాల్సిన అమ్మయిని తమ్ముడు చేసుకోవాల్సి వచ్చింది. అయితే అప్పటి వరకు ఒక వ్యక్తిని భర్తగా ఊహించుకున్న ఆమెకు ఆయన తమ్ముడు భర్త అని తెలిసే సరికి మనసు కుదుటపడలేదు. కానీ పెద్దల నిర్ణయం కనుక ఒప్పుకోక తప్పలేదు. మొత్తానికి వారి పెళ్లి జరిగింది. అయితే ఆ తరువాత ఆ అమ్మాయి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఓ సందర్భంగా పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఆ అమ్మాయి ఒక విషయం అడిగింది.
‘నిన్నటి వరకు మీ అన్నయ్యను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా నీతో జీవితం గడపాల్సి వస్తుంది. అయితే నీ గురించి నాకు పూర్తిగా తెలియదు. కొన్నాళ్లు స్నేహితుల్లాగా ఉందాం.. ఆ తరువాత ఒకరినొకరు అర్థం చేసుకున్న తరువాత భార్యభర్తలుగా ఫిక్స్ అవుదాం..’ అని చెప్పింది. అయితే అమ్మాయి చెప్పిన దానికి అతడు ఒప్పుకోక తప్పలేదు. ఎందుకంటే తన గురించి పూర్తిగా తెలియక తనతో సంతోషంగా ఉంటుందని అనుకోలేం. దీంతో ఒకే చెప్పాడు. అయితే ఈరోజుల్లో ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా? అని ఆ యువకుడు తన అనుభవం గురించి చెప్పాడు. అంతేకాకుండా తనను కూడా ప్రేమించే అమ్మాయిలు ఉన్నారా? అని ఆశ్చర్యపోయానని చెప్పాడు.