https://oktelugu.com/

Soundarya Rejected Ali: అలీ పక్కన చేయబోనని రిజెక్ట్ చేసిన సౌందర్య.. కట్ చేస్తే ఆమెనే ఛాన్స్ కోసం రిక్వెస్ట్..

Soundarya Rejected Ali: సినిమారంగంలో అవకాశాలు రావడం ఒక ఎత్తయితే.. వచ్చిన వాటిలో ది బెస్ట్ ను ఎంచుకోవడం మరో ఎత్తు. చాలామంది హీరో లేదా హీరోయిన్ లు ఏవేవో కారణాలు చెప్పి మంచి కథలను వదులుకుంటారు. అవే కథలతో వేరేవాళ్లు సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొడితే మాత్రం బాధపడక తప్పదు. ఎందుకంటే ఇలాంటి హిట్లు పడితేనే కెరీర్ లో స్టార్ గా ఎదుగుతారు. అయితే స్టార్ హీరోయిన్ అయిన తర్వాత చాలామంది చిన్న […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 31, 2022 / 11:38 AM IST
    Follow us on

    Soundarya Rejected Ali: సినిమారంగంలో అవకాశాలు రావడం ఒక ఎత్తయితే.. వచ్చిన వాటిలో ది బెస్ట్ ను ఎంచుకోవడం మరో ఎత్తు. చాలామంది హీరో లేదా హీరోయిన్ లు ఏవేవో కారణాలు చెప్పి మంచి కథలను వదులుకుంటారు. అవే కథలతో వేరేవాళ్లు సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొడితే మాత్రం బాధపడక తప్పదు. ఎందుకంటే ఇలాంటి హిట్లు పడితేనే కెరీర్ లో స్టార్ గా ఎదుగుతారు. అయితే స్టార్ హీరోయిన్ అయిన తర్వాత చాలామంది చిన్న హీరోలతో చేయడానికి ఒప్పుకోరు. ఎందుకంటే పెద్ద హీరోలతో మళ్లీ చాన్స్ వస్తుందో రాదో అని భయపడతారు.

    Soundarya, Ali

    ఇలాంటి కారణమే చెప్పి దివంగత హీరోయిన్ సౌందర్య అలీ పక్కన చేయబోనని తేల్చి చెప్పేసిందట. మరి ఆ విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్లాసిక్ డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి అప్పట్లో చాలా ఫేమస్. ఆయన అలీతో యమలీల సినిమా చేయాలనుకున్నప్పుడు మొదట హీరోయిన్ గా సౌందర్యను అనుకున్నారట. కథ చెప్పగా సౌందర్య కూడా ఓకే చెప్పేసిందట.

    Also Read: Puneeth Rajkumar: పునీత్ హీరోగా నిలదొక్కుకోవడానికి తెలుగు సినిమాలే కారణం.. అవేంటో తెలుసా..?

    కానీ ఏమైందో ఏమో గానీ.. ఒకరోజు సడన్ గా కృష్ణారెడ్డిని కలిసి తాను సినిమా చేయబోనంటూ చెప్పేసిందట. కారణమేంటంటూ కృష్ణారెడ్డి అడగ్గా.. తాను ప్రస్తుతం పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నానని.. ఇలాంటప్పుడు అలీతో చేస్తే తన ఇమేజ్ దెబ్బతింటుందేమో అని సందేహం వ్యక్తం చేసిందట. అలీ కాకుండా పెద్ద హీరో అయితే చెప్పండి చేస్తాను అని ఖరాఖండిగా చెప్పేసింది. అయితే యమలీల సినిమాకు అలీ తప్ప ఎవరూ సూట్ కారని.. ఎవరినైనా వదులుకుంటాను తప్ప అలీని వదులుకోను అంటూ కృష్ణారెడ్డి తేల్చి చెప్పేశారట.

    దీంతో చేసేది లేక సౌందర్య ఆ సినిమా నుంచి తప్పకుంది. ఈ సమయంలో కృష్ణారెడ్డి ఇంద్రజను తీసుకు రావడం, అలీ పక్కన పెట్టి సినిమా తీయడం చకచకా జరిగిపోయాయి. సినిమా విడుదలైన తర్వాత ఎవ్వరూ ఊహించని ఫలితం వచ్చింది. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ టాక్ రావడంతో.. అలీ ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. దీని తర్వాత క కృష్ణారెడ్డి శుభలగ్నం సినిమా తీశారు. ఇందులో అలీతో ఒక సాంగ్ చేయాలని కృష్ణారెడ్డి ఒక హీరోయిన్ కోసం వెతుకుతున్నారు.

    Soundarya, Ali

    ఈ విషయం తెలుసుకున్న సౌందర్య.. ఆయన దగ్గరకు వచ్చి తాను అలీ పక్కన చేస్తానంటూ రిక్వెస్ట్ చేసిందట. ఒకప్పుడు యమలీల లాంటి సెన్సేషనల్ హిట్ మూవీని వదులుకున్నానని.. ఇప్పుడు ఆ లోటును తీర్చుకుంటానని అలీ పక్కన తాను చేస్తాను అంటూ ముందుకు వచ్చిందట. ఆ సాంగే చినుకు చినుకు అందెలతో అనే పాట. ఈ సాంగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అలా ఒకప్పుడు తన పక్కన నటించబోనని చెప్పిన సౌందర్యతో.. అలీ ఎదిగి చూపించి తనే వచ్చి అవకాశం అడిగేలా చేశాడంటూ.. ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.

    Also Read: AR Rahaman: ఏఆర్ రెహమాన్ సంగీతం చేయడు.. అవన్నీ వేరే వాళ్ల ట్యూన్స్?

    Tags