Apple Airtag: ఇంటికి తాళం వేసి వెళ్లి.. తిరిగొచ్చేసరికి ఏం జరుగుతుందో తెలియక చాలా మంది భయంతో ఉంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణాన దొంగలు పడుతారో తెలియని పరిస్థితి. దొంగలు పడకుండా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఎంత టెక్నాలజీ వాడుతున్నా.. చోరీ చేసేవారు అంతకంతకు వినూత్న పద్ధతులు ఉపయోగించి వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. దీంతో ఇటు ప్రజలకు అటు పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. అయితే యాపిల్ కంపెనీ తయారు చేసిన ఓ పరికరం ద్వారా ఎంత పెద్ద దొంగనైనా పట్టుకోవచ్చు. ఒకసారి అలా ప్రయోగం చేసిన వరుస దొంగతనాలు చేసే ఓ ముఠాను పట్టుకున్నారు. ఇంతకీ ఆ పరికరం ఏంటి? దానిని ధర ఎంత?
కొన్ని రోజుల కొందట అమెరికాలోని టెక్సాస్ లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయని విన్నాం. వీరంతా ఏ ఇంట్లోని వస్తువులో.. బ్యాంకుల్లో డబ్బు దోచుకెళ్లలేదు. సమాధుల్లోని శవాలపై ఉన్న విలువైన వస్తువులను దొంగతనాలు చేశారు. అయితే టెక్సాస్ లోని టోని వెలజ్ కెజ్ కి చెందిన ఓ ఫ్యామిలీ ఈ దొంగలను ఎలాగైనా పట్టుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం టెక్నాలజీని ఉపయోగించాలనుకున్నారు. అప్పటికే మార్కెట్లోకి వచ్చిన యాపిల్ ఎయిర్ ట్యాగ్ ని ఉపయోగించారు.
గ్రేవ్ లోని ఓ వస్తువులో యాపిల్ ఎయిర్ ట్యాగ్ ని రహస్యంగా దాచి ఉంచారు. దొంగతనాలు చేసేవారు ఎప్పటిగాలో ఎయిర్ ట్యాగ్ పరికరం ఉన్న వస్తువును దొంగిలించారు. ఈ విషయాన్ని టోనీ ఫ్యామిలీ పోలీసులకు చెప్పారు. ఆ తరువాత ఫైండ్ మై యాప్ సహాయంతో కేవలం 45 నిమిషాల్లోనే దొంగలను గుర్తించగలిగారు. వారికి సంబంధించిన లోకేషన్ ను గుర్తించి అధికారులకు అక్కడికి చేరుకున్నారు. అయితే దొంగలకు టోనీ ఫ్యామిలీకి సంబంధించిన వస్తువులే కాకుండా వందల కొద్దీ వస్తువులను చోరీ చేశారు. వీటి విలువ 62 వేల డాలర్లు ఉంటుంది. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎయిర్ ట్యాగ్ అనే పరికరాన్ని 2021 లో యాపిల్ సంస్థ ప్రవేశపెట్టింది. ఇది బ్లూటూత్ ఆధారంగా పనిచేస్తుంది. ఎయిర్ ట్యాగ్ కు బ్లూటూత్ కనెక్ట్ చేయడం ద్వారా ఎయిర్ ట్యాగ్ ఎక్కడున్నా దాని లోకేషన్ ను ఐక్లౌడ్ కు పంపిస్తుంది. ఫైండ్ మై యాప్ ను డౌన్లోడ్ చేసుకొని దీనిని గుర్తించవచ్చు. లోకేషన్ ను మ్యాప్ ద్వారా గుర్తించి అక్కడికి వెళ్లొచ్చి. ఇది యూజర్స్ ప్రైవసీకి ఎలాంటి భంగం కలిగించదని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.