Angulimala Story: ఒక్క మాటతో క్రూరుడి మనసును మార్చిన బుద్ధుడు.. అసలేంటీ ‘అంగుళిమాల’ కథ?

అంగుళి మాల అంటే చేతి వేళ్ల దండ. అంటే చేతి వేళ్లు కత్తిరించి వాటిని మాలగా తయారు చేసి మెడలో వేసుకోవడం. గౌతమ బుద్ధుడి కాలంలో అహింసకుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు పాఠాలు నేర్చుకోవడానికి గురువు దగ్గరికి వెళ్లిన ప్పుడు తోటి వారు అతడిని అసహించుకునేవారు. దీంతో అతనిపై లేని పోని అబద్దాలను గురువుకు చెప్పేవారు.

Written By: Chai Muchhata, Updated On : July 25, 2024 12:00 pm

Angulimala Story

Follow us on

Angulimala Story: భారతదేశం ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలది. ఇక్కడ వింతలు విశేషాలతో పాటు సాంప్రదాయాలు ప్రేమానురాగాలు విరసిల్లుతుంటాయి. కుటుంబ వ్యవస్థ ఇండియాలో ఎక్కువగా ఉండడంతో బంధాలు, బాంధవ్యాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఒకప్పడు కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటూ ఒకే వ్యాపారం చేసేవారు. అయితే టెక్నాలజీ రంగంలోకి దిగిన తరువాత ఈ వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతోంది. అయితే ఎన్ని బంధాలు విడిపోయినా.. కుటుంబ సభ్యుల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా.. ప్రేమగా చిన్న మాటతో మళ్లీ బంధాన్ని కలుపుకోవచ్చని కొన్ని చరిత్రలు చెబుతున్నాయి. కొన్ని యుద్దాల సమయంలోనూ బలప్రదర్శన కాకుండా చిన్న మాటతో సంధి చేసుకొని సుఖ శాంతులతో జీవించిన వారు ఎందరో ఉన్నారు. ఈ ప్రేమానురాగం వ్యవస్థలను చక్కబెట్టడమే కాకుండా క్రూరమైన మనుషులను కూడా మారుస్తుంది. అందుకు ఓ చరిత్రే నిదర్శనం. అదే అంగుళిమాల కథ. బుద్దుడు, అంగుళిమాల ల మధ్య జరిగిన ఓ సంఘటన మనిషి ఎంత క్రూరుడైనా ప్రేమకు కరిగిపోతాడని తెలుపుతుంది. అంగుళి మాల గురించి నేటి తరానికి ఎవరికీ తెలియికపోవచ్చు. కానీ ఈయన జీవితం మాత్రం నేటి తరానికి ఆదర్శం అని చెప్పవచ్చు. ఇప్పుడున్న కొంత మందిలో క్రూర ద్వేషాలు పెరిగిపోయాయి. అలాంటి వారిని మంచి నడవడికలో ఎలా మారచాలన్నది ఈ చరిత్ర చెబుతుంది. ఎంతడి మూర్ఖులనైనా సక్రమార్గంలో నడిపించేలా చేస్తుంది. మరి ఆంగుళిమాల చరిత్ర తెలుసుకోవాలని ఉందా? అయితే కిందికి వెళ్లండి..

అంగుళి మాల అంటే చేతి వేళ్ల దండ. అంటే చేతి వేళ్లు కత్తిరించి వాటిని మాలగా తయారు చేసి మెడలో వేసుకోవడం. గౌతమ బుద్ధుడి కాలంలో అహింసకుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు పాఠాలు నేర్చుకోవడానికి గురువు దగ్గరికి వెళ్లిన ప్పుడు తోటి వారు అతడిని అసహించుకునేవారు. దీంతో అతనిపై లేని పోని అబద్దాలను గురువుకు చెప్పేవారు. తన చదవు కోసం గురువే దగ్గరకు రావాలని అంటున్నట్లు అహింసకుడిపై ప్రచారం చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న గురువు అహింసకుడిపై కోపాన్ని తీర్చుకోవాలని అనుకుంటాడు. దీంతో ఓసారి అహింసకుడిని పిలిచి తనకు గురు దక్షిణగా ఏమి ఇవ్వగలుగుతావు? అని అడుగుతాడు. దీంతో అతడు ‘మీరు కోరుకున్నది ఇస్తాను’ అని మాట ఇస్తాడు.

దీంతో ఆ గురువు తనకు ‘వెయ్యి వేళ్లు కావాలి’ అని అడుగుతాడు. అయితే ఇది పాపం అని గురువుకు, శిష్యుడికీ తెలుసు. కానీ గురువకు ఇచ్చిన మాట ప్రకాంర అహింసకుడు వెయ్యి వేళ్ల కోసం అడవికి వెళ్లాడు. అడవిలోకి వచ్చినబాటసారులను చంపి వారి వేళ్లు తీస్తాడు. అయితే అలా తొలగించిన వేళ్లను ఎక్కడ పెట్టాలో తెలియక వాటిని మాలగా తయారు చేస్తారు. దీనిని ‘అంగుళి మాల’ అని అంటారు. అలా గురువు కోరిక తీర్చడానికి ఇంకా ఒక్క వేలే మిగిలి ఉంటుంది. ఇదే సమయంలో అటువైపు గౌతమ బుద్ధుడు వస్తాడు. వెంటనే అహింసకుడు బుద్ధుడి వేలు తీయడానికి రెడీ అవుతాడు. కానీ బుద్దుడిని చూడగానే అ పని చేయలేకపోతాడు.

అహింసకుడు కత్తి పట్టుకొని వస్తున్నా బుద్దుడు శాంతంగా అతనిని ప్రేమతో చూస్తాడు. ఈ సమయంలో బుద్ధుడు తేజస్సుతో ప్రకాశిస్తూ ప్రేమగా అతనితో ‘నా వేలు తీసుకోవడం వల్ల నీకు మనశ్శాంతి కలుగుతుందంటే వెంటనే తీసుకో’ అని అంటాడు. అయితే అహింసకుడు బుద్దుడు ప్రేమగా మాట్లాడడం చూసి కరిగపోతాడు. వెంటనే తన మనసు మార్చుకుంటాడు. ఆ తరువాత తన సంకల్పం గురించి చెబుతాడు. అలా అంగుళికుడు బుద్ధుడికి ప్రియ శిష్యుడిగా మారిపోతాడు.