https://oktelugu.com/

Financial Tips:  జీతం తీసుకునే వ్యక్తులకు అలర్ట్.. తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!

Financial Tips:  దేశంలో చాలామంది ఉద్యోగులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగం చేసే సమయంలో సంపాదించిన మొత్తం ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగులు ఏదైనా రుణం తీసుకుంటే ఆ రుణాన్ని చెల్లించే బాధ్యత కూడా అ వ్యక్తిపైనే ఉంటుంది. ఎక్కువ మొత్తంలో అప్పులు చేస్తే ఆ అప్పుల నుంచి సులువుగా బయటపడటం సాధ్యం కాదు. జీతం తీసుకునే వ్యక్తులు తప్పనిసరిగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. తీసుకున్న రుణాన్ని గడువు కంటే ముందుగానే చెల్లిస్తే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 9, 2022 7:02 pm
    Follow us on

    Financial Tips:  దేశంలో చాలామంది ఉద్యోగులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగం చేసే సమయంలో సంపాదించిన మొత్తం ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగులు ఏదైనా రుణం తీసుకుంటే ఆ రుణాన్ని చెల్లించే బాధ్యత కూడా అ వ్యక్తిపైనే ఉంటుంది. ఎక్కువ మొత్తంలో అప్పులు చేస్తే ఆ అప్పుల నుంచి సులువుగా బయటపడటం సాధ్యం కాదు. జీతం తీసుకునే వ్యక్తులు తప్పనిసరిగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

    తీసుకున్న రుణాన్ని గడువు కంటే ముందుగానే చెల్లిస్తే మంచిది. ఈ విధంగా ముందుగానే రుణాలను చెల్లించడం ద్వారా భవిష్యత్తును చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. భవిష్యత్తుకు సంబంధించిన బడ్జెట్ ను సైతం ఈ విధంగా సులువుగా తయారు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఒకటి కంటే ఎక్కువగా అప్పులు ఉన్నవాళ్లు సరైన ప్రణాళికలను సిద్ధం చేసుకొని రుణాలను చెల్లించాలి.

    ఎక్కువ వడ్డీ భారం పడే రుణాలను మొదట చెల్లిస్తే మంచిదని చెప్పవచ్చు. క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకున్న మొత్తం కూడా ఒక విధంగా రుణం అనే చెప్పవచ్చు. అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకునే మొత్తాన్ని సరైన సమయానికి చెల్లించడం అవసరం. సరైన సమయానికి ఈ రుణాలను చెల్లించడం సాధ్యం కాకపోతే ఎక్కువ మొత్తం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

    రుణాలను చెల్లించే సమయంలో తక్కువ మొత్తం రుణాలను ముందు చెల్లించడం ద్వారా రుణ భారం తగ్గుతుంది. చిన్న రుణాలను చెల్లించడం ద్వారా రుణ భారం క్రమంగా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. వ్యక్తిగత బడ్జెట్ ద్వారా అనసవరమైన ఖర్చులను తగ్గించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్త పడవచ్చు.