Airtel New Offer 2025: మొబైల్ నెట్వర్క్ లో Airtel నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకుంది. అయితే ఆ తర్వాత jio మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎయిర్టెల్ స్థానం మారింది. కానీ చాలామంది ఎయిర్టెల్ సిమ్ లను తీసివేయలేదు. సురక్షితమైన, నాణ్యమైన నెట్వర్క్ ఉంటుందని కొంతమంది ఎయిర్టెల్ సిమ్ ను అలాగే కొనసాగిస్తున్నారు. ఎయిర్టెల్ సిమ్ యూస్ చేసే వారికి రీఛార్జ్, ఇతర ఇంటర్నెట్ ప్యాక్లు కాస్త ఖరీదుగానే ఉన్నా చాలామంది దీనికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే సుదీర్ఘకాలంగా ఎయిర్టెల్ ను కొనసాగిస్తున్న వారికి నెట్వర్క్ సంస్థ కొన్ని సందర్భాల్లో ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటుంది. తాజాగా ఎయిర్టెల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ 17, 000 విలువచేసే ఒక దానిని ఉచితంగా ఇవ్వనుంది. మరి దాని గురించి తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ వివరాల్లోకి వెళ్ళండి.
Also Read: మీ పాన్ కార్డు, ఆధార్ మీద ఎన్ని లోన్లు ఉన్నాయో ఇలా తెలుసుకోండి
ప్రస్తుత కాలంలో Artificial Intelligence అందుబాటులోకి రావడంతో చాలామంది దీనినే ఫాలో అవుతున్నారు. ఫొటోస్ నుంచి వీడియోల వరకు ఏఐ ద్వారానే క్రియేట్ చేస్తున్నారు. అయితే ఏఐ సంబంధించిన సమాచారం కావాలంటే Google లోకి వెళ్లాల్సిందే. సెర్చ్ ఇంజన్లో గూగుల్ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. కానీ ఇప్పుడు గూగుల్ తరహాలోనే ఖచ్చితమైన సమాచారం ఇచ్చేందుకు Perplex City అందుబాటులోకి వచ్చింది. ఇది ఒక వైపు గూగుల్ లాగా సెర్చ్ ఇంజన్ గా పనిచేస్తూ.. మరోవైపు Chat GPT లాగా అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఎలాంటి ప్రశ్న అడిగిన అందుకు సమాధానం వేగంగా వెంటనే అందిస్తుంది. అందుకే చాలామంది పబ్లిక్ సిటీ నీ కోరుకుంటున్నారు.
అయితే Perplex City ప్రో కావాలని అనుకునేవారు దీనికోసం రూ.17, 000 చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఏడాది కోసం మాత్రమే. అయితే ఈ మొత్తాన్ని ఇప్పుడు ఎయిర్టెల్ ఉన్నవారికి ఉచితంగా అందివ్వనున్నారు. అంటే ఎయిర్టెల్ వినియోగదారులు Perplex City ప్రోను ఏడాది పాటు ఉచితంగా వాడుకోవచ్చు. అందుకోసం ముందుగా ఈ పని చేయాలి.
Also Read: కెరీర్లో సక్సెస్ కావాలంటే ఈ 10 స్కిల్స్ ఉండాల్సిందే.. హర్ష్ గోయెంకా సూచనలివే
Airtel Thanks App లేనివారు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో Rewards అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి. ఇందులో కచ్చితంగా Perplex City అనే ఆఫర్ ఉంటుంది. దీనిని ఓపెన్ చేయాలి. అప్పుడు దీనిని ఓకే చేసుకుంటే Perplex City నీ వాడుకోవచ్చు. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే అని తెలుస్తోంది. ఎయిర్టెల్ సిమ్ ఉన్నవారికి ఇది బంపర్ ఆఫర్ అని అనుకోవచ్చు.
Perplex City అనేది సెర్చ్ ఇంజన్. ప్రస్తుతం ఇది ట్రెండింగ్లో రాబోతుంది. చాలామంది దీని ద్వారా ఏఐ కంటెంట్ను పొందుతున్నారు. కావలసిన సమాచారం ఇస్తూ.. అవసరమైన ఫోటోలు, వీడియోలు దీని ద్వారా పొందవచ్చు.