Success Tips for Career: మీరు కెరీర్‌లో దూసుకుపోవాలనుకుంటున్నారా? అయితే అందుకు కొన్ని విషయాలు అలవర్చుకోవాలి. అవి అందరికీ బాగా ఉపయోగపడుతాయి. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఎప్పుడూ సోషల్ మీడియాలో యువతకు అవసరమైన విషయాలు చెబుతుంటారు. ఇప్పుడు జీవితంలో విజయం సాధించడానికి తప్పకుండా నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన స్కిల్స్ గురించి ఆయన వివరించారు. అవేంటో తెలుసుకుందాం.
1. ఆర్గనైజేషన్ స్కిల్స్
మీ పనుల్లో క్రమబద్ధత చాలా ముఖ్యం. సమయానికి స్పందించడం మీరు ఏదైనా తప్పు చేస్తే దానికి బాధ్యత తీసుకోవడం వంటివి అలవర్చుకోవాలి. ఇది మీ పనిని బాగా పూర్తి చేయడంలో సాయపడుతుంది.
2. డెసిషన్ మేకింగ్
ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనైనా, ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా ధైర్యంగా సరైన నిర్ణయాలు తీసుకోగలగాలి. ఇలాంటి వాళ్లే నిజమైన లీడర్లుగా ఎదుగుతారు.
3. ఎమోషనల్ ఇంటెలిజెన్స్
తెలివితేటలు ఉంటే సరిపోదు. మీ భావోద్వేగాలను అదుపు చేసుకుంటూ పరిస్థితులు చేయి దాటిపోకుండా చూసుకోవడం చాలా అవసరం. ఇది వ్యక్తిగత సంబంధాల్లో, ఉద్యోగంలో విజయానికి ఇది చాలా కీలకం.
Also Read: బంగారం, వజ్రాలు సాటి రావు.. ఈ చెట్టు కిలో కలప కోటి రూపాయలు.. ఇంతకీ దీని విశిష్టతలు ఏమిటంటే..
4. సెల్ఫ్ మేనేజ్‌మెంట్
ఏకాగ్రత, క్రమశిక్షణ చాలా ముఖ్యమైనవి. మీ లక్ష్యాల వైపు స్థిరంగా అడుగులు వేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి.
5. లీడర్‌షిప్
ఇతరులకు స్ఫూర్తిగా ఉండేలా ప్రవర్తించాలి. వాళ్లతో గౌరవంగా, స్నేహపూర్వకంగా ఉండటం అవసరం. మంచి లీడర్ ఎప్పుడూ తన టీమ్‌ను ప్రోత్సహిస్తాడు.
6. కమ్యూనికేషన్
ప్రతి ఉద్యోగంలోనూ ఇతరులతో బాగా మాట్లాడటం, వాళ్లను మెప్పించడం తప్పనిసరి. స్పష్టంగా మాట్లాడటం వల్ల అపార్ధాలు తగ్గిపోతాయి. దూరం తగ్గుతుంది.
7. క్రిటికల్ థింకింగ్
కష్టమైన పరిస్థితుల్లో వేగంగా నిర్ణయం తీసుకుని, సమస్యలను పరిష్కరించగలిగిన వాళ్లు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇది సమస్యలను లోతుగా ఆలోచించి, పరిష్కారాలు కనుగొనే సామర్థ్యన్ని అందిస్తుంది.
Also Read: ఈ పండు తింటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికిపోతారు.. జాగ్రత్త..
8. రీసెర్చ్, అనాలసిస్
కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపాలి. ఈ నైపుణ్యం మీకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.. విజయాన్ని అందిస్తుంది. సమాచారాన్ని సేకరించి, దాన్ని విశ్లేషించడం ఇందులో భాగం.
9. టీమ్ వర్క్
ఏ చోటైనా, ఎలాంటి వారితోనైనా కలిసికట్టుగా పని చేయగలగాలి. దీనివల్ల పని ప్రదేశంలో మీ గౌరవం పెరుగుతుంది. మంచి ఫలితాలు వస్తాయి.
10. రైటింగ్ స్కిల్స్
మీరు చేయాలనుకున్న పనులతో ఎదుటివారిని మెప్పించాలన్నా, వాళ్లకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలన్నా, మీరు రాసి చూపించగలగడం చాలా ముఖ్యం. ఇది మీ ఆలోచనలను బాగా వ్యక్తపరచడానికి సాయపడుతుంది.