https://oktelugu.com/

Zodiac Signs: సంక్రాంతి తరువాత ఈ రాశుల వారికి ఏడాదంతా పండుగే..

గ్రహాల మార్పు ఆరు నెలలకు ఒకసారి ఉంటుంది. గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అనుకోని మార్పులు ఉంటాయి. ఒక్కోసారి గ్రహాల మార్పు లేకపోయినా రోజులను బట్టి జాతకాల్లో ఊహించని మార్పులు ఉంటాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : January 7, 2025 / 05:21 PM IST

    Zodiac Signs

    Follow us on

    Zodiac Signs: గ్రహాల మార్పు ఆరు నెలలకు ఒకసారి ఉంటుంది. గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అనుకోని మార్పులు ఉంటాయి. ఒక్కోసారి గ్రహాల మార్పు లేకపోయినా రోజులను బట్టి జాతకాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. 2025 ఏడాది ప్రారంభం అయింది.మరికొన్నిరోజుల్లో మకర సంక్రాంతి రాబోతుంది. ఈ సమయంలో సూర్యుడు దక్షిణయానం నుంచి ఉత్తరాణాయం పయనిస్తాడు. దీంతో కొన్ని రాశులవారిపై ప్రభావం ఉంటుంది. దీంతో ఆ రాశుల వారి జీవితాల్లో అనుకోని సంఘటనలు ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ తరువాత వారి జీవితాల్లో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇంతకీ ఆ రాశులు ఏవో తెలుసుకుందామా?

    మకర సంక్రాంతి తరువాత కొన్ని రాశుల వారికి శుభగడియలు ప్రారంభం కానున్నాయి. వీరిలో వృషభ రాశి వారికి అనుకూలమైన జీవితం ఉండనుంది. ఈ రాశివారు ఈ ఏడాది పొడవునా ఊహించని ధనం పొందుతారు. ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతారు. కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక లావాదేవీలు పుంజుకుంటాయి. గతంలో అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటారు. అయితే ఇక్కడ ఆచి తూచి వ్యవహరించాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.

    మిథున రాశి వారికి సంక్రాంతి తరువాత మంచి రోజులు రానున్నాయి. వీరికి ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. వీరికి గ్రహబలం అనుకూలంగా ఉండడంతో ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అన్ని శుభపలితాలే ఉంటాయి. కొన్ని పెండింగ్ సమస్యల నుంచి బయటపడుతారు. ఆర్థికంగా పుంజుకుంటారు. స్నేహతులతో ఉల్లాసంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయడానికి అనుకూల వాతావరణం. కొత్త ప్రదేశాలకు వెళ్లడంతో మనసు ప్రశాంతంగా మారుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే పెద్దల సలహా తీసుకోవాలి.

    సంక్రాంతి పండుగ తరువాత కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. వీరికి గురు, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉండనున్నాయి. దీంతో ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు ఉంటాయి. కొందరికి లక్ష్మీదేవి కటాక్షం కారణంగా వివిధ మార్గాల నుంచి డబ్బు వచ్చి చేరుతుంది.

    కుంభ రాశి వారి జాతక చక్రమం మారిపోనుంది. వీరికి బృహస్పతి, శుక్రుడు అనుకూలంగా ఉండడంతో సంపద పెరిగే అవకాశం. ఏడాది మొత్తం ఏదో రకంగా ఆదాయాన్ని పొందుతారు. కొన్ని ఖర్చులు పెరిగినా.. అంతకు మించి ఆదాయాన్ని పొదుతారు. నైపుణ్యాలు ఉన్న వారు ఉద్యోగాల్లో రాణిస్తారు. ఫలితాంగా అదనపు ఆదాయం పొందుతారు. విదేశాల్లో ఉండే విద్యార్థుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. వాహనాలపై దూర ప్రయాణాలు చేస్తారు. అయితే కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త వ్యక్తులను కలవడంతో మనసు ఉల్లాసంగా ఉంటుంది.