https://oktelugu.com/

Industries in AP : ఏపీలో పరిశ్రమలు.. రెండు సంస్థలతో ఒప్పందం.. లోకేష్ లక్ష్యం అదే!

కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. అభివృద్ధితో పాటు పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ( AP government) కృత నిశ్చయంతో అడుగులు వేస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : January 7, 2025 / 06:18 PM IST

    Industries in AP

    Follow us on

    Industries in AP : పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం( AP government) ఫోకస్ పెట్టింది. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో( green Energy field) పెట్టుబడులు ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ఆ ఒక్క రంగంలోనే సుమారు ఏడున్నర లక్షల ఉద్యోగాలను కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఏర్పాటు కోసం సత్వర చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు రెండు కీలక ఒప్పందాలు జరిగాయి. సుజలాన్ ఎనర్జీ( Suzlon energy), స్వనీతి( swaniti) ఇనిషియేటివ్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. అలాగే స్వనీతి, ఏపీ ప్రభుత్వం మధ్య మరో కూడా కుదిరింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh)ఎక్స్ వేదికగా వెల్లడించారు.

    * ఆ విషయంలో ఏపీ గమ్యస్థానం
    గ్రీన్ ఎనర్జీ నైపుణ్యం విషయంలో ప్రపంచానికి ఏపీ గమ్యస్థానంగా ఉండాలనేదే తమ లక్ష్యంగా చెప్పుకొచ్చారు మంత్రి నారా లోకేష్( Nara Lokesh). అందులో భాగంగానే ఈ రెండు కీలక ఒప్పందాలుగా చెప్పారు. వీటితోనే ప్రపంచవ్యాప్తంగా ఏపీ యువతకు ఉద్యోగ అవకాశాలు( youth employment ) లభిస్తాయని ఆకాంక్షించారు. వచ్చే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ ను విండ్ ఎనర్జీ నైపుణ్యాల కేంద్రంగా మార్చడానికి సుజలాన్ ఎనర్జీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు.

    * అమెరికాలో పర్యటన
    ఇప్పటికే మంత్రి నారా లోకేష్ అమెరికాలో( America) పర్యటించారు. కొద్ది నెలల కిందట ఆయన పర్యటన విజయవంతంగా సాగింది. ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ఆయన వరుసగా సమావేశం అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కొన్ని సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయి. ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. ఇప్పుడు ఒకే రోజు రెండు సంస్థలు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడం విశేషం.

    * ఐటీ హబ్ గా విశాఖ
    విశాఖను ఐటి హబ్ గా ( Visakha IT hub )మార్చాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే కొన్ని ఐటీ సంస్థలు తమ సుముఖత వ్యక్తం చేశాయి. శాశ్వత భవనాలు నిర్మించే లోగా తమకు తాత్కాలిక భవనాలు కేటాయించాలని కోరాయి. నెలల వ్యవధిలోనే తమ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆలోచనతో ఉన్నాయి. భారత దిగ్గజ ఐటీ సంస్థ ఒకటి విశాఖకు వచ్చేందుకు సుముఖంగా ఉంది. అందుకు తన సమ్మతిని కూడా తెలిపింది. అయితే శాశ్వత భవనం నిర్మించే లోగా.. తమకు ఖాళీగా ఉన్న భవనం అప్పగిస్తే కార్యకలాపాలను ప్రారంభిస్తామని చెప్పుకొచ్చింది. దీనిపై ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే కూటమి అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే.. మంచి పరిణితి కనబరచడం.. పారిశ్రామికంగా వృద్ధి సాధించడం శుభపరిణామం.