Acharya Chanukya : ఆ కాలంలో ఆచార్య చానిక్యుడు అత్యంత తెలివైన వాళ్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. అప్పట్లో ఆయన చెప్పిన విషయాలు అన్నీ కూడా ఇప్పటి ప్రజలకు కూడా ఆదర్శంగా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాల గురించి నీతి శాస్త్రంలో ఆచార్య చానిక్యుడు ప్రస్తావించడం జరిగింది. స్త్రీకి ఉండాల్సిన లక్షణాల గురించి ఆయన నీతి శాస్త్రంలో చాలా చక్కగా వివరించారు. ఒక కుటుంబం ఆనందంగా ఉండాలి అన్నా లేదా నాశనం కావాలి అన్న ఆ ఇంట్లో ఉండే స్త్రీ లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది అని ఆచార్య చాణిక్యుడు తెలిపాడు. స్త్రీకి ఉండే ఈ కొన్ని లక్షణాల కారణంగా కుటుంబం నాశనం అవుతుంది అని ఆయన తెలిపాడు. ఒక కుటుంబంలో స్త్రీ అవసరానికి మించి డబ్బులు ఖర్చు చేసినట్లయితే అటువంటి కుటుంబం ఎప్పటికి అభివృద్ధి చెందదని అయినా తెలిపాడు. స్త్రీ తన బట్టలు అలాగే మేకప్ వంటి వాటి మీద ఎక్కువగా డబ్బులు ఖర్చు చేసినట్లయితే ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బులు సరిపోవని అలాగే ఆ కుటుంబం కూడా ఆర్థికంగా ఎప్పటికీ ఎదగలేదని ఆచార్య చానిక్యుడు తెలిపాడు.
ఇటువంటి లక్షణం ఉన్న స్త్రీ కుటుంబంలో ఉన్నట్లయితే ఆ కుటుంబం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంది అని తెలిపాడు. కొంతమంది స్త్రీలకు చిన్న చిన్న విషయాలకే కోపం పడే అలవాటు ఉంటుంది. ఇటువంటి స్త్రీలు ఉన్నట్లయితే ఆ కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. ప్రతిరోజు గొడవలు జరిగే ఇళ్లలో శ్రేయస్సు, డబ్బులు ఉండవు అని ఆచార్య చానిక్యుడు నీతి శాస్త్రంలో తెలిపాడు. కొంతమంది స్త్రీలు పక్కింటి వాళ్ల గురించి విమర్శలు చేయడం, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడుకోవడం అలాగే కుటుంబ విషయాలను బయట వాళ్లకు చెప్పడం వంటివి చేస్తూ ఉంటారు. ఇటువంటి లక్షణాలు ఉన్న స్త్రీల వలన ఆ ఇంటి గౌరవం నాశనం అయ్యే అవకాశం ఉంది.
కాబట్టి ఇటువంటి స్త్రీలు ఇంట్లో లేకపోవడమే మంచిది అంటూ ఆచార్య చానిక్యుడు చెప్తున్నాడు. కొంతమంది స్త్రీలు తమకున్న అందంతో లేదా ధనంతో చాలా గర్వపడుతూ ఉంటారు. ఇటువంటి వారికి సమాజంలో గౌరవం ఉండదు. గర్వం ఉన్న చోట ప్రేమ కూడా ఉండదు. అందంతో, ధనంతో గర్వపడే స్త్రీ చివరికు ఒంటరిగా మిగిలిపోతుంది. కొంతమంది స్త్రీలు తమ భర్త సంపాదనను చాలా తక్కువగా ఉందని హేళన చేస్తూ ఉంటారు. ఇతరుల సంపాదనతో తన భర్త సంపాదనను పోల్చడం అనేది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఇటువంటి లక్షణాలు ఉన్న స్త్రీ ఉండడం వలన కుటుంబం మానసికంగా మరియు ఆర్థికంగా కూడా దెబ్బతింటుంది.