Bengaluru Stampede: ఆర్సీబీ విక్టరీ పరేట్ సందర్భంగా తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. ఈ ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది. ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు కోర్టులో విచారణ ప్రారంభం కానుంది. బుధవార మధ్యాహ్నం 3.30 గంటలకు విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు పరేడ్ ఉంటుందని ఆర్సీబీ జట్టు నిన్న ఉదయం ప్రకటించింది. అయితే అభిమానుల రాకను ముందే అంచనా వేసిన పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు.