https://oktelugu.com/

Beauty Tips : వయస్సుతో పాటు అందం కూడా పెరుగుతుంది.. ఎలా అంటే?

కొన్ని దేశాల అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. వాళ్ల వయస్సు ఎక్కువగానే ఉంటుంది. కానీ చూడటానికి మాత్రం యవ్వనంగా ఉంటారు. దీనికి ముఖ్యకారణం వాళ్లు ముత్యాల పొడిని వాడటమే. ఎక్కువగా చైనా మహిళలు దీనిని వాడుతారట. ముత్యాలను మెత్తగా పొడి చేసి నిల్వ ఉంచుకుంటారు. ఈ పొడితోనే ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం,

Written By:
  • Bhaskar
  • , Updated On : August 23, 2024 2:02 pm
    Beauty Tips

    Beauty Tips

    Follow us on

    Beauty Tips : చాలామంది అమ్మాయిలు అందానికి ప్రాముఖ్యత ఇస్తుంటారు. అయితే వాళ్లు తినే ఫుడ్, స్కిన్ కేర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. దీంతో వాళ్ల వయస్సు పెరిగిన అందంగా కనిపిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్ల వయస్సుతో పాటు అందం కూడా పెరుగుతూ ఉంటుంది. వాళ్ల వయస్సుకి, యవ్వనానికి అసలు సంబంధమే ఉండదు. అలా ఉంటారు కొంతమంది అమ్మాయిలు. ఈ కాలంలో చాలామంది అందం కోసం ఎన్నో రకాల క్రీంలు వాడుతున్నారు. కానీ పూర్వ కాలంలో మాత్రం సహజ పద్ధతులను పాటించేవారు. వయస్సు పెరిగినా సరే అందంగా కనిపించడంతో పాటు యవ్వనంగా కూడా ఉండాలంటే కొన్ని సహజ పద్ధతులు ఉంటాయి. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ రసాయనాలు ఉండే క్రీంలను వాడటం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. ఇంతకీ చర్మాన్ని మెరిపించే ఆ సహజ పద్ధతులు ఏంటో తెలుసుకుందామా.

    కొన్ని దేశాల అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. వాళ్ల వయస్సు ఎక్కువగానే ఉంటుంది. కానీ చూడటానికి మాత్రం యవ్వనంగా ఉంటారు. దీనికి ముఖ్యకారణం వాళ్లు ముత్యాల పొడిని వాడటమే. ఎక్కువగా చైనా మహిళలు దీనిని వాడుతారట. ముత్యాలను మెత్తగా పొడి చేసి నిల్వ ఉంచుకుంటారు. ఈ పొడితోనే ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం, ఫేషియల్స్ చేయించుకోవడం వంటివి చేస్తుంటారు. ఈ పొడి వల్ల చర్మం కాంతిమంతంగా ఉంటుంది. స్కిన్‌లో ఎలాంటి మడతలు లేకుండా అందంగా ఉంటారు. ముత్యాల పొడిలో ఉండే ఆమైనో ఆమ్లాలు, ఖనిజాలు చర్మం గ్లోగా ఉండేలా చేస్తుంది. సాధారణంగా మనం బియ్యం కడిగిన నీటిని బయట పడేస్తుంటాం. కానీ బియ్యం కడిగిన వాటర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందట. బయట దేశాల అమ్మాయిలు బియ్యం కడిగిన నీటినే టోనర్‌గా కూడా ఉపయోగిస్తారట. ఈ వాటర్ చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

    చర్మానికి మసాజ్ చేయడానికి కొంతమంది కొబ్బరి, బాదం వంటి నూనెలు వాడుతారు. కానీ వీటి కంటే కమీలియా నూనె వాడటం వల్ల చర్మం అందంగా ఉంటుందట. గులాబీ పువ్వులా ఉండే పూల నుంచి ఈ నూనెను తయారు చేస్తారు. ఈ నూనెను చర్మానికి అప్లై చేసి మర్దన చేస్తే చర్మం మెరుస్తుంది. ముఖానికి రాసిన కూడా జిడ్డులా అనిపించదు. ఈ నూనె చాలా మంచిదని.. రోజూ అప్లై చేయడం వల్ల స్కిన్ గ్లోగా ఉంటుంది. అయితే ఈ నూనెను కేవలం చర్మానికి మాత్రమే కాకుండా జుట్టుకు కూడా అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటు యోగా, మెడిటేషన్, వ్యాయామం వంటివి చేస్తుండాలి. అప్పుడే మీ వయస్సు కనిపించకుండా అందంగా ఉంటారు. రోజుకి కనీసం 30 నిమిషాలు అయిన సరే వ్యాయామం, యోగా ఏదో ఒకటి చేయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీరు యవ్వనంగా ఉంటారు.