AC power saving tips : ఎండా కాలంలో కరెంట్ బిల్లు పెరిగిపోతుందని టెన్షన్ గా ఉందా ? ఇక మీదట టెన్షన్ పడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఈరోజు ఒక అద్భుతమైన ట్రిక్ తెలుసుకుందాం. దీనిని ట్రై చేస్తే ప్రతి నెల మీ కరెంట్ బిల్లు తగ్గుతూ వస్తుండడం మీరే గమనించవచ్చు. ఎండాకాలం పెరుగుతున్న కొద్దీ చాలా మంది AC టెంపరేచర్‌ను తగ్గిస్తూ ఉంటారు. కానీ టెంపరేచర్ తగ్గించడం వల్ల కరెంట్ బిల్లు పెరుగుతుంది. పెరిగిన బిల్లుతో మీ జేబులకు చిల్లు పడుతుంది. మీ
Also Read : కూలర్లతో డెంగ్యూ వస్తుందా? ఎలాగా?
ఏసీ నడిపే అలవాటులో కొంచెం మార్పు చేయడం వల్ల ప్రతి నెల ఎలా డబ్బు ఆదా చేయవచ్చో చూద్దాం. ఏసీ టెంపరేచర్ తగ్గించడం వల్ల మీకు చల్లని గాలి ఖచ్చితంగా వస్తుంది, కానీ దీని వల్ల కంప్రెసర్‌పై లోడ్ పెరుగుతుంది. దీని కారణంగా ఏసీ ఎక్కువ విద్యుత్‌ను లాగుతుంది. ఎక్కువ విద్యుత్‌ను లాగడం అంటే ఎక్కువ విద్యుత్ వినియోగం. వినియోగం పెరిగితే, ప్రతి నెల మీరు వేల రూపాయల కరెంట్ బిల్లు చెల్లించాల్సి రావచ్చు. కరెంట్ బిల్లును తగ్గించడానికి ఒక సులభమైన మార్గం ఉంది.
బిల్లు ఎంత తగ్గుతుంది?
16 డిగ్రీల బదులు 24 డిగ్రీల వద్ద ఎయిర్ కండీషనర్‌ను నడపడం వల్ల ఎంత విద్యుత్ ఆదా అవుతంతో తెలుసా.. ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇన్ఫర్మేషన్ టూల్ (https://udit.beeindia.gov.in/) ఒక ప్రభుత్వ వెబ్‌సైట్. ఈ సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, 1 డిగ్రీ పెంచడం వల్ల 6 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. ఈ లెక్కన చూస్తే 16 నుండి 24 డిగ్రీల మధ్య 8 డిగ్రీల వ్యత్యాసం ఉంది. ప్రతి డిగ్రీ పెంచడం వల్ల 6 శాతం విద్యుత్ ఆదా అవుతోంది. కాబట్టి 8 డిగ్రీలంటే 48 శాతం విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉంది. అంటే మీరు 16 డిగ్రీల బదులు 24 డిగ్రీల వద్ద ఏసీ నడిపే అలవాటు చేసుకుంటే ప్రతి నెల వచ్చే కరెంట్ బిల్లు దాదాపు సగానికి తగ్గిపోతుంది.