Coolers : ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలామంది చల్లదనం కోసం ఆరాటపడుతూ ఉంటారు. ఈ సమయంలో ఉష్ణోగ్రత అధికంగా ఉండడంతో చల్లటి గాలి కోసం కూలర్లు ఏర్పాటు చేసుకుంటారు. డబ్బున్నవారైతే ఏసీలను ఫిట్ చేసుకుంటారు. అయితే చాలామంది మిడిల్ క్లాస్ ఎక్కువగా కూలీలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంటారు. తక్కువ ధరలతో పాటు కాస్త చల్లదనాన్ని ఇచ్చే కూలర్లు ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంటాయి. అయితే కూలల్లో వాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. కూలర్ల తో డెంగ్యూ, మలేరియా వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అసలు ఈ కూలర్ల వల్ల అలాంటి వ్యాధులు ఎలా వస్తాయి? కూలర్లను ఉపయోగించేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Also Read : రోడ్డు మీద లభించే కూలర్ V/S బ్రాండెడ్ కూలర్? ఏది బెటర్?
దాదాపు కూలర్లు రెండు నెలలు మాత్రమే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఒక్కసారి కూలర్ ను కొనుగోలు చేస్తే మరో ఏడాది వచ్చేవరకు దీనిని స్టోర్ చేసుకోవాల్సిందే. ఈ క్రమంలో దీని వాడకం తక్కువగా ఉంటుంది. అయితే దాదాపు పది నెలల పాటు స్టోర్ లో ఉన్న కూలరు తీసి ఒకేసారి వాడడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ రోజు స్టోర్ లో ఉన్న కూలర్ ఏదైనా సమస్యతో నిండి ఉంటుంది. టెక్నికల్ గా కూలర్ లోని అన్ని వైర్లు సరిగా ఉన్నాయా? లేవా? వాడే ముందు చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా కూలర్ కు వాటరు అందించే పైపులు లీకేజీ ఉన్నాయా? లేవా? అనేది ముందే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి స్టోర్ లో ఉన్న సమయంలో డ్యామేజీ అవుతూ ఉంటాయి. ఇలా డామేజ్ అయిన వాటిని ఏంసిల్ తో అతికించుకోవచ్చు.
చాలా రోజుల తర్వాత స్టోర్ లో ఉన్న కూలర్ తిరిగి వాడే సమయంలో గడ్డిని కొత్తగా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే పాత గడ్డిలో అనేక రకాల బ్యాక్టీరియా దాగి ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో కొన్ని క్రిములు కూడా ఉంటాయి. వీటిని ఒకేసారి వాడడం వల్ల మనుషుల శరీరంపై పడే ప్రమాదం ఉంది. అందువల్ల గడ్డి బాగా ఉంటే కనీసం మూడు గంటల పాటు దానిని రన్ చేసి.. ఆ తర్వాత ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. లేదా గడ్డి పాడైపోతే కొత్తదానిని ఏర్పాటు చేసుకోవాలి.
ఇక కూలర్ల వల్ల డెంగ్యూ, మలేరియా వచ్చే అవకాశం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూలర్లలో ఎక్కువ శాతం నీరు నిల్వ ఉంటుంది. కొందరు దీనిని పట్టించుకోకుండా రోజుల తరబడి అదే నీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా అందులో కాస్త నీరు ఉండగానే మరింత నీరును యాడ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఈ నీటిలో దోమలు ఎక్కువ కాలం నిలువ ఉండి గుడ్లను పెడుతూ ఉంటాయి. ఇదే నీరు కూలర్ ద్వారా మనుషులకు వచ్చినప్పుడు బ్యాక్టీరియా చేరిపోతుంది. అంతేకాకుండా ఈ నీటిలో ఎక్కువ కాలం డెంగ్యూ దోమలు నిల్వ ఉంటాయి. ఇవి మనుషులను కొట్టినప్పుడు డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. అందువల్ల కూలర్ల నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. కనీసం వారం రోజులకు ఒకసారి నీటిని మారుస్తూ ఉండాలి.
Also Read : ఎండల్లో హాయ్ హాయ్..రూ.5000 లోపు లభించే 5 ఎయిర్ కూలర్లు!