Vehicle for large families: చాలామంది తమ కుటుంబ అవసరాల కోసం కారును కొనుగోలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబం ఉన్నవాళ్లు తమకు ప్రత్యేకంగా వెహికల్ ఉండాలని ఏర్పాటు చేసుకుంటారు. విహారయాత్రలకు.. లేదా ఇతర ప్రయాణాలు చేయడానికి అనుగుణంగా ఉండేందుకు 7 Seater వెహికల్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా సెవెన్ సీటర్ వాహనాలను అందుబాటులోకి తెస్తూ ఉంటాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన Auto Mobiliti Showలో Tayota కంపెనీ సెవెన్ సీటర్ వెహికల్ ను పరిచయం చేసింది. ఇది ఉమ్మడి కుటుంబంలోని సభ్యులు అంతా కలిసి ప్రయాణం చేయడానికి అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా చూడడానికి ఆకర్షణీయంగా ఉండే ఈ వెహికల్ ప్రత్యేకతలను కూడా తెలిపింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Tayota పేరు చెప్పగానే మనకు ఇన్నోవా గుర్తుకువస్తుంది. దశాబ్దాలపాటు Innova వెహికల్ ను ఎక్కువమంది కొనుగోలు చేశారు. రెండు ఫ్యామిలీలు కలిసి ప్రయాణం చేయాలనుకుంటే Innova ఎంచుకునేవారు. ఇప్పుడు అదే తరహాలో టయోటా కంపెనీ కొత్త వాహనాన్ని పరిచయం చేసింది. E X-Van అనే పేరుతో ఉన్న దీని బాడీ స్టైల్ విభిన్నంగా కనిపిస్తుంది. ఈ మినీ వ్యాన్ కోర్ టూల్ మోడల్ కల్పి తయారు చేశారు. ఇందులో ఏడుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా వెళ్లవచ్చు. ఇది సెవెన్ సీటర్ వాహనం అయినప్పటికీ దీనికి రెండు డోర్లు మాత్రమే ఉంటాయి. అలాగే ఫ్రంట్ సీట్లు రియల్ సీట్లకు సపరేటు డోర్స్ ను అమర్చారు. అయితే డ్రైవర్ కు ప్రత్యేకంగా డోర్ అంటూ ఏమీ లేదు. కానీ ఇందులోకి సులభంగా వెళ్లి.. దిగవచ్చు.
ఈ కారు మినీ వ్యాన్ ను పోలి ఉంటుంది. ఎందుకంటే దీని పొడవు 4,695 m.m., వెడల్పు 1,820m.m.గా ఉంది. అలాగే పవర్ ట్రైన్ ను కూడా అమర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిని ప్రదర్శించినప్పటికీ పూర్తి వివరాలు వెల్లడించలేదు. కానీ దీనిని ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ తో తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరో విషయం ఏంటంటే ఇది మార్కెట్లోకి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగ ప్రతినిధులు అంటున్నారు. కానీ ఒకవేళ ఇది అందుబాటులోకి వస్తే టయోటాకు చెందిన ఇన్నోవా లాగే దీనిని ఎక్కువ మంది కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.
సెవెన్ సీటర్ వేరియంట్ లో ఇప్పటికే ఎన్నో వాహనాలు వచ్చినప్పటికీ టయోటా కంపెనీకి చెందిన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. దీంతో ఈ కంపెనీ తాజాగా ప్రవేశపెట్టిన ఈ మినీ వ్యాన్ గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు ఇక దీని చూసిన చాలామంది త్వరగా మార్కెట్ లోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు. ఓవైపు మినీ వ్యాన్ లో కనిపించిన ఫ్యామిలీ లు కలిసి విహారయాత్రలకు వెళ్లడానికి సులభంగా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే దీనిలో అమర్చే ఇంజన్ మైలేజ్ కూడా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు అయితే దీని ధర ఎంతో ఉంటుందో చూడాలి