Rich Indians Avoid Alcohol: ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పనితో ఒత్తిడిని కలిగి ఉన్న చాలా మంది రిలాక్స్ కావాలని చూస్తారు. ఈ రిలాక్స్ లో భాగంగా మద్యం సేవించేవారు చాలామంది ఉంటారు. అయితే కొందరు ఒత్తిడి తగ్గించుకోవడానికి రెండు పెగ్గులు వేస్తుంటారు. కొందరు మాత్రం పీకలదాకా తాగి అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే ఇదే సమయంలో కొందరు సంపన్నులు సైతం ప్రతిరోజు మద్యం తీసుకునే వారు ఉన్నారు. కానీ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం కొందరు ధనవంతులు మద్యానికి దూరంగా ఉంటున్నారట. మరి అలా ఉండడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఉన్నవారికి.. లేనివారికి మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడానికి మద్యం పనిచేస్తుందని కొందరు సూక్తులు చెబుతూ ఉంటారు. కానీ మద్యం ఎప్పటికైనా అనారోగ్యానికి కారణమే అని వైద్యులు హెచ్చరిస్తుంటారు. అయినా కూడా ప్రతిరోజు లిమిట్ గా తాగితే ఎలాంటి అపాయం ఉండదని కొందరు భావించి.. ప్రతిరోజు మద్యం తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిలో ధనవంతులు సైతం రిలాక్స్ కావడానికి సాయంత్రం లైట్ స్వీప్ చేసేవారు ఉన్నారు. అయితే Mercedes Benz, Hurun India లగ్జరీ లైఫ్ పై కన్జ్యూమర్ సర్వేను నిర్వహించింది. ఈ సర్వే లో 150 మంది నీ తీసుకున్నారు. వీరి నికర సంపద 8.5 కోట్లుగా ఉంది. వీరిలో 34 శాతం మంది మద్యం సేవించమని చెప్పారు. 32 శాతం మంది ఆల్కహాల్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలా తీసుకున్న వారిలో రెడ్ వైన్, షాంపైన్ కు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు మద్యం తాగే వారి సంఖ్య తగ్గుతుందని ఈ సంస్థ వెల్లడించింది.
అయితే మద్యం తాగడం తగ్గించడానికి అనేక కారణాలు చెబుతున్నారు. కొందరు ప్రత్యేకంగా ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆల్కహాల్ సేవిస్తున్న వారిపై ఇటీవల నిర్వహించిన సర్వేలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రతిరోజు రెండు పెగ్గులు తీసుకున్న వారిలో కూడా ఈ సమస్య ఉంటుందని వెల్లడించారు. అంతేకాకుండా మద్యం సేవించడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం పొందినా.. దీర్ఘకాలికంగా అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కిడ్నీల పై ఈ ప్రభావం ఎక్కువ చూపుతున్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. అందుకే చాలామంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మద్యానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
ఇక మరికొందరు మద్యం పై ఖర్చును అనవసరంగా గుర్తించారు. మద్యంపై చేసే ఖర్చులు ఇతర ఆహార పదార్థాలపై విచిస్తున్నారు. మద్యం సేవించడం కంటే ఆహార పదార్థాలను సేవించడం వల్ల ఎనర్జీ వస్తుందని ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా మద్యం సేవించడం వల్ల అల్జీమర్ సమస్యలు కూడా ఎదుర్కోవడంతో చాలామంది దీనికి దూరంగానే ఉంటున్నారు. అయితే కొంతమంది మాత్రం మద్యం ఎక్కువ తాగే వారు ఇప్పుడిప్పుడే తక్కువ మోతాదులో తీసుకుంటున్నారు. ఒకేసారి మద్యం ఆపివేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో మీరు తగ్గిస్తున్నారు. భవిష్యత్తులో వీరు కూడా పూర్తిగా మద్యానికి దూరంగా ఉండే అవకాశం ఉంది.