Aadhar Card New Updates: ఆధార్ కార్డుతో మొబైల్ సిమ్ కార్డు లింక్ తప్పనిసరి అని అందరికీ తెలిసిందే. దీంతో చాలామంది తమకు ఉన్న ఆధార్ కార్డు కు తమ పర్సనల్ నెంబర్ ను లింక్ చేశారు. అయితే ఒక్కోసారి మనం సిమ్ కార్డ్స్ ను మారుస్తూ ఉంటాం. ఇలా మార్చినప్పుడు ఇదే నెంబర్ ఇతరులకు వెళ్తుంది. మన ఆధార్ కార్డుతో ఇతరుల మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది. దీంతో ఏవైనా ముఖ్యమైన మెసేజ్ వచ్చినప్పుడు వేరే వాళ్ళ వద్ద ఉన్న నెంబర్ వద్దకు వెళుతుంది. దీంతో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా కొందరు ఆ సిమ్ ను తప్పుడు మార్గంలో ఉపయోగిస్తే ఆ సిమ్ కు లింకు అయి ఉన్న ఆధార్ కార్డుదారులు సమస్యల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. మరి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఆధార్ కార్డు విషయంలో Uidai ఎప్పటికప్పుడు కొత్త సమాచారాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా లేటెస్ట్ గా ఆధార్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో అనేక రకాల సేవలను ఏర్పాటు చేశారు. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడం కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే మనం మొబైల్ సిమ్ మార్చినప్పుడు ఆధార్ కార్డు కు లింక్ అయి ఉన్న కొత్త సిమ్ కార్డును అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకుంటే గతంలో లింకు అయి ఉన్న ఫోన్ నెంబర్ కి మెసేజ్లు వెళ్తూ ఉంటాయి. అయితే ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలంటే ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇలా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది..
ఆధార్ కార్డు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత.. ఇందులో ఆధార్ కార్డు నెంబర్ ను ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఒక చిన్న అతేంటికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు క్యూఆర్ కోడ్ రూపంలో ఆధార్ కార్డు డిస్ప్లే అవుతుంది. అయితే మొబైల్ కింది నుంచి పైకి స్వైప్ చేయడం వల్ల ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో My Aadhar Update అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిని ప్రెస్ చేయగానే మరో పేజీ కనిపిస్తుంది. ఇందులో ఫస్ట్ బాక్సులో Mobile Update అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిని ప్రెస్ చేయగానే కంటిన్యూ అనే బాక్స్ వస్తుంది. దానిపై ప్రెస్ చేయగానే… ఆధార్ కార్డు కు లింక్ అయి ఉన్న పాత నెంబర్ డిస్ప్లే అవుతుంది. కింద New Mobile Number అనే బాక్స్ కనిపిస్తుంది. ఇందులో కొత్త నెంబర్ ఎంట్రీ చేయాలి. ఇప్పుడు కొత్త నెంబర్ కు ఓటిపి వస్తుంది. ఓటిపి ఎంట్రీ చేసిన తర్వాత మరోసారి అథటికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రూ.75 రుసుము చెల్లించాలని అడుగుతుంది.. అప్పుడు ఫోన్ పే లేదా ఇతర యాప్ ద్వారా ఈ మనీని చెల్లించాలి. ఇది చెల్లించిన తర్వాత 30 రోజుల వరకు మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది. ఈ విధంగా ఆధార్ సెంటర్ కు ప్రత్యేకంగా వెళ్లకుండా యాప్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు.