Bird Nest at Home: ప్రకృతి మానవ జీవితం గురించి అనేక సూచనలు ఇస్తుంది. వీటిలో పక్షుల పాత్ర చాలా ముఖ్యమైనది. అనేక సంస్కృతులలో పక్షులు మంచి, చెడుతో ముడిపడి ఉంటాయి. అందువల్ల, ఇంట్లో పక్షి గూడు కట్టడం మంచిదా కాదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే ఇంటి వద్ద పక్షి గూడు కట్టడం మంచిదే అంటారు కానీ అన్ని పక్షులు గూడు కట్టడం మంచిది కాదు. దీని వల్ల చాలా చెడు ప్రభావాలు ఉంటాయట. అయితే ఏ పక్షులు గూడు కట్టవద్దు? ఏ పక్షుల గూడు ఇంటికి మంచిదో తెలుసుకుందామా?
ఈ పక్షుల గూడు చాలా పవిత్రమైనది.
ఇంట్లో పక్షులు గూడు కట్టుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. కొంతమంది దీనిని శుభప్రదంగా భావిస్తారు. మరికొందరు దీనిని అశుభంగా భావిస్తారు. వాస్తు, జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఇంట్లో కొన్ని పక్షులు గూడు కట్టుకోవడం శుభప్రదంగా పరిగణిస్తారు. ముఖ్యంగా పిచ్చుకలు, పావురాలు శుభ్రప్రదం. ఇంట్లో పావురాలు లేదా పిచ్చుకలు గూడు కట్టడం ఆ ఇంట్లో నివసించే ప్రజలకు చాలా శుభప్రదమని జ్యోతిష్యం నమ్ముతుంది. పిచ్చుక గూడు కట్టుకునే ఇంట్లో, ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. ఇంట్లో ఆనందం వస్తుంది. దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది అని అంటారు నిపుణులు.
పక్షులు తమ గూడు కోసం ఎంచుకునే ప్రదేశం సురక్షితమైనది. మంచి శక్తితో నిండి ఉంటుందని నమ్ముతారు. అందువల్ల, ఒక ఇల్లు పక్షులకు ఆశ్రయంగా మారినప్పుడు, అది అక్కడ ఉన్న సానుకూల శక్తికి సంకేతంగా పరిగణిస్తారు.
పావురం గూడు సంపద రాకకు సంకేతం,
అయితే ఇంట్లో పావురం గూడు ఉండటం ఆ ఇంట్లో నివసించే ప్రజలకు సంపద రాకకు సంకేతం. వాస్తవానికి, పావురాన్ని లక్ష్మీ దేవి భక్తురాలిగా భావిస్తారు. అందువల్ల, ఇంట్లో పావురం గూడు కట్టడం శుభప్రదంగా పరిగణిస్తారు. పావురం గూడు కట్టిన ఇంట్లో సంపద, శాంతి నెలకొంటాయని నమ్ముతారు.
ఇంట్లో పక్షి గుడ్లు పెట్టడం అదృష్టానికి సంకేతం.
జ్యోతిష్యం ప్రకారం, ఇంట్లో పక్షి గుడ్లు పెడితే, అది అదృష్టాన్ని తెస్తుంది. దీనిని శుభ శకునంగా భావిస్తారు. ఆ ఇంట్లో శ్రేయస్సు పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆర్థిక లాభం పొందే అవకాశం కూడా ఉంది.
ఈ పక్షుల గూడు చెడు శకునానికి సంకేతం.
పిచ్చుకల మాదిరిగానే, గబ్బిలాలు కూడా ఇళ్లలో గూళ్ళు కట్టుకుంటాయి. కానీ గబ్బిలాల గూడు కట్టుకోవడం చెడు శకునంగా పరిగణిస్తారు. ఇంట్లో గబ్బిలాల గూడు ఉంటే, అది దురదృష్టానికి సంకేతంగా నమ్ముతారు. గబ్బిలాలు బలహీనమైన సంకల్ప శక్తికి చిహ్నం. ఇంట్లో గబ్బిలాలు ఉండటం కుటుంబంలో విభేదాలకు, తగాదాలకు దారితీస్తుంది. గబ్బిలాలు చీకటితో సంబంధం ఉన్న జీవులు కాబట్టి, వాటి ఉనికి ప్రతికూల శక్తులకు సంకేతంగా మారుతుంది.
ఇంట్లో తేనెటీగలు గూడు కట్టుకోవడం కూడా మంచి సంకేతం కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం, అటువంటి పరిస్థితిలో, తేనెటీగల గూడును వెంటనే తొలగించాలి. తేనెటీగల గూడు ఉన్న ఇంట్లో, అభివృద్ధికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పెరగవచ్చు. ఇంట్లో తేనెటీగలు గూడు కట్టడం అభివృద్ధికి ఆటంకం. ప్రతికూల శక్తుల ప్రభావానికి సంకేతంగా పరిగణిస్తారు. పక్షులు ఇంట్లో గూళ్ళు కట్టుకోవడం, గుడ్లు పెట్టడం కొన్ని సందర్భాల్లో మంచి సంకేతం కావచ్చు. కానీ ప్రతి పక్షి మంచి సంకేతం కాదు. కొన్ని పక్షులు దురదృష్టానికి చిహ్నం. మీ ఇంట్లో ఒక పక్షిని చూసినట్లయితే, ఆ పక్షి శకునం ఏమిటో గుర్తుంచుకోవడం ముఖ్యం.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.