Ladakh: కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ లో నివసిస్తున్న ప్రజల భాష, రాజ్యాంగ పరిరక్షణ కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వారి స్థానికత, రిజర్వేషన్ల పై అధికారికంగా ప్రకటించింది. 85 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించింది. 15 ఏళ్లకు మించి ఆ ప్రాంతంలో నివసిస్తున్నావారు, కనీసం 7 ఏళ్లపాటు అక్కడ చదువుకొని 10 లేదా 12 వ తరగతి పరీక్షలకు హాజరైనవారిని స్థానికులుగా గుర్తించాలని నిర్ణయించింది. అంతే కాకుండా లద్దాఖ్ అటానమస్ మిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ లో మూడు లో ఒక వంతు సీట్లు మహిళలకే కేటాయించనున్నారు.